HomeVideosవర్షంలో రొమాన్స్ తో రెచ్చిపోయిన నాగ శౌర్య

వర్షంలో రొమాన్స్ తో రెచ్చిపోయిన నాగ శౌర్య

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్న నాగ శౌర్య..తాజాగా కృష్ణ వ్రిందా విహారి మూవీ తో ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనీష్‌ ఆర్‌. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ తాలూకా ప్రమోషన్లను స్పీడ్ చేసారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ విపరీతంగా ఆకట్టుకోగా..చిత్రంలోని ‘వర్షంలో వెన్నెల’ పాటను క్రేజీ బ్యూటీ సమంత ఈరోజు విడుదల చేసింది.

- Advertisement -

రా వెన్నెల్లో వర్షంలా.. రా వర్షంలా వెన్నెల్లా.. అందాలిలా అందాయిగా..’ అంటూ సాగిన ఈ రొమాంటిక్ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. మహతి స్వర సాగర్ బ్యూటీఫుల్ ట్యూన్ కంపోజ్ చేయగా.. సంజన కల్మంజే మరియు ఆదిత్య ఆర్కే కలసి వినసొంపుగా ఆలపించారు. హీరోహీరోయిన్ల మధ్య భావాలను తెలియజేసేలా శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ పాటలో నాగశౌర్య- షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ ముచ్చటగా ఉంది. కూల్ గా సాగుతూ రొమాంటిక్ ఫీల్ తో పాట వినసొంపుగా ఉంటే.. అందుకు తగ్గట్లే విజువల్ సింపుల్ గా క్యూట్ గా ఉంటూ యూత్ ను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ లో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తుండగా..సీనియర్ నటి రాధికా కీలక పాత్రలో నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ లో వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటించగా ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ సంగీతమందిస్తున్నారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All