
నిత్యం ఏదొక ట్వీట్ తో వార్తల్లో నిలిచే వర్మ..ప్రస్తుతం కెజిఎఫ్ 2 ను ఉద్దేశించి వరుస ట్వీట్స్ చేస్తున్నారు. కేజీఎఫ్ 2 ఓపెనింగ్ కలెక్షన్లనుద్దేశించి వర్మ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల లిస్టును షేర్ చేస్తూ..బాలీవుడ్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రాలుగా కన్నడ డబ్బింగ్ మూవీ కేజీఎఫ్ 2, తెలుగు డబ్బింగ్ మూవీ బాహుబలి 2 ఉండటం పట్ల…హిందీ ఫిలిం ఇండస్ట్రీ (బాలీవుడ్) ఏం ఆలోచిస్తుందని..మీరు అనుకుంటున్నారు..అని అడుగుతూ ట్వీట్ చేసి చర్చ కు దారి తీసాడు. ఈ ట్వీట్ ఫై బాలీవుడ్ లో మంట పుట్టించగా..ఆ వేడి ఇంకా తగ్గనేలేదు. తాజాగా స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఫై ట్వీట్ చేసి మరింత వైరల్ గా మారాడు.
స్టార్స్ రెమ్యూనరేషన్ కోసం డబ్బులు వేస్ట్ చేయకపోతే మంచి క్వాలిటీ కంటెంట్ వస్తుందని దానికి “కేజీఎఫ్-2” మూవీ హిట్ అవ్వడమే ప్రూఫ్ అంటూ ట్వీట్ చేశారు. “స్టార్స్ రెమ్యూనరేషన్ కోసం డబ్బులు వృధా చేయకుండా మేకింగ్ కోసం ఖర్చు చేస్తే మరింత నాణ్యత, గొప్ప హిట్‌లు వస్తాయి అనడానికి KGF 2 మాన్స్టర్ హిట్టే స్పష్టమైన రుజువు” అంటూ వర్మ ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్స్ కు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.