Homeటాప్ స్టోరీస్అమ్మ రాజ్యంలో.. వర్మ సామాన్యుడు కాడు సుమీ

అమ్మ రాజ్యంలో.. వర్మ సామాన్యుడు కాడు సుమీ

అమ్మ రాజ్యంలో.. వర్మ సామాన్యుడు కాడు సుమీ
అమ్మ రాజ్యంలో.. వర్మ సామాన్యుడు కాడు సుమీ

రామ్ గోపాల్ వర్మ స్థాయి దర్శకుడిగా ఎప్పుడో పడిపోయిందన్నది అందరికీ తెలిసిందే. సినిమాను చాలా తేలిగ్గా తీసుకుంటూ ఏదో ఒకటి చుట్టిపారేసి చూస్తే చుడండి లేదంటే లేదు అనడం వర్మ స్టైల్. రాము తీసే సినిమాలకన్నా, అతను సినిమాను చూసే విధానమే అతని ఫ్యాన్స్ కు ఎక్కువ ఆవేదన కలిగిస్తోంది. అయితే రామ్ గోపాల్ వర్మ దగ్గర ఒక స్టైల్ ఉంది. ప్రతిసారి ఇంతకంటే లో లెవెల్ కు పడలేడన్న ప్రతిసారీ సరికొత్త లో కు పడుతూ వర్మ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇటీవలే వచ్చిన వర్మ సినిమాలు అన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఘోరంగా ఉన్నాయన్న టాక్ ను తెచ్చుకున్నాయి. కానీ తన ప్రతి సినిమాకీ వర్మ ప్రేక్షకుల్లో అంచనాలు కలిగించడంలో నేర్పు సంపాదిస్తున్నాడు. ముందు ఎంత చెత్త సినిమా తీసినా కానీ తర్వాతి సినిమాకు తన గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేసుకోవడం వర్మకే తెల్సిన గొప్ప విద్య.

లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయమే తీసుకుంటే.. ఈ సినిమా కథ ఒక వివాదాస్పద అంశం చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ సినిమా మేకింగ్ అత్యంత లో క్వాలిటీ, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇంకా బాగా డైరెక్ట్ చేయగలరు అనిపించేలా ఉంది అన్న టాక్ బలంగా వచ్చింది. అయినా కానీ నిన్న విడుదలైన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు విపరీతమైన బజ్ తీసుకురాగలిగాడు వర్మ. ఎంత స్ట్రాంగ్ బజ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల ఈ చిత్రానికి హౌజ్ ఫుల్స్ పడ్డాయి. తెలంగాణలో జనసందోహం కొంచెం తక్కువే ఉన్నా ఏపీలో మాత్రం థియేటర్ల వద్ద జనాల హడావిడి బాగా కనిపిస్తుంది. ఇది చూసిన ఎవడైనా వర్మ సామాన్యుడు కాడురా బాబు అనుకోకుండా ఉండడు.

- Advertisement -

అయితే అమ్మ రాజ్యంలో సినిమాకు హౌస్ ఫుల్స్ పడినా కానీ సినిమాకు బాగా విమర్శలు వస్తున్నాయి. మొత్తం బోరింగ్ గా ఈ సినిమాను మలిచాడు వర్మ. ఒక పార్టీకి అనుకూలంగా ఈ చిత్రం ఉన్నా కానీ వాళ్ళు కూడా మెచ్చలేని విధంగా సినిమా ఉండడం కొసమెరుపు. అయినా కానీ వర్మ అనుకున్న విషయంలో మాత్రం ఫుల్ సక్సెస్ అని చెప్పాలి. ఈ చిత్రాన్ని చాలా తక్కువ మొత్తంలో చుట్టేశాడు. కనీసం 2 కోట్లు కూడా అవ్వలేదని తెలుస్తోంది. తొలిరోజు దాదాపుగా హౌజ్ ఫుల్స్ పడిన ఈ చిత్రం వీకెండ్ ముగిసేనాటికి సేఫ్ అయిపోతుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. సినిమా క్వాలిటీ ఎలా ఉన్నా కానీ వర్మ మాత్రం ప్రతిసారీ సక్సెస్ అవుతున్నాడు. అందుకనే అనేది వర్మ మామూలోడు కాదు అని.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All