
రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలు గా నటించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) భారీ అంచనాల మధ్య నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి , ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు రాజమౌళి ప్రతిభ ఫై , ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటన ఫై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక చిత్ర సీమలో అయితే ప్రతి ఒక్కరు సినిమా కు జై జై లు కొడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు , హీరోలు, దర్శకులు , నిర్మాతలు సినిమా ఫై ప్రశంసలు జల్లు కురిపించగా..తాజాగా వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
బాహుబలితో ఆర్‌ఆర్‌ఆర్‌ని పోలుస్తూ ఇదొక చారిత్రాత్మక చిత్రం అని కొనియాడాడు. ‘బాహుబలి-2 అనేది చరిత్ర.. ఆర్‌ఆర్‌ఆర్ అనేది చారిత్రాత్మకం’అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు.అలాగే దర్శకుడు రాజమౌళిని ఉద్దేశించి… బాక్సాఫీస్‌కు మోక్షం కలిగించిన గొప్ప వ్యక్తి అనే అర్థంలో ఆర్జీవీ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.