
నిర్మాత నట్టికుమార్ ఓ పానకంలో పుడక..అన్నారు రామ్ గోపాల్ వర్మ. వర్మ తనను మోసం చేసాడని , తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని.. డబ్బులు ఇవ్వకుండా ఆర్జీవీ తప్పించుకుంటున్నాడని నట్టి కుమార్ కోర్ట్ లో పిటిషన్ వేసాడు. దీనిపై వర్మ వివరణ ఇస్తూ ట్విటర్‌లో వీడియో రిలీజ్ చేశాడు.
‘నట్టి కుమార్ నోటీసులకు నా అడ్వకేట్ సమాధానం ఇస్తాడు. ఇక నాపై చేసిన వ్యక్తిగత ఆరోపణలకు ఎలా సమాధానం ఇవ్వాలో తెలుసు. ప్రెస్‌మీట్‌లు పెట్టడం వాళ్ళని వీళ్ళని తిట్టడం తప్ప అతని లైఫ్‌లో ఏం లేదని అనుకుంటున్నా. గతంలో చిరంజీవి, నిర్మాత సురేష్ బాబు మీద ఇలాంటి ఆరోపణలే చేశాడు.. ఇప్పుడు నామీద.. ఇలా తన లైఫ్ అంత ప్రెస్‌మీట్‌లే ఉంటాయి’ అంటూ ఆర్జీవీ మండిపడ్డాడు. అంతేకాదు ‘ఇప్పుడు తన కొడుకు, కూతురితో సినిమా చేస్తే ప్రమోషన్ చేయలేదనో.. రావల్సిన కమీషన్ రాలేదని ఇండస్ట్రీలో కొందరిని ఆయన దూషించిన సందర్భాలు చాలా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే ‘డేంజరస్ సినిమా వాయిదా వేయడానికి నట్టి కుమార్ కారణం కాదు. దానికి వేరే కారణం ఉంది. లెస్బియన్ నేపథ్యంలో ఈ సినిమా తీయడం వల్ల చాలా థియేటర్లు మా చిత్రాన్ని ప్రదర్శించేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై లీగల్‌గా ఫైట్ చేసేందుకే సినిమా విడుదలను వాయిదా వేశాం’ అని వర్మ క్లారిటీ ఇచ్చాడు.