
దీనిపై డ్రాగన్ కంట్రీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా జిన్‌పింగ్ గృహనిర్బంధం వార్త హాట్‌టాపిక్‌గా మారింది. నిజంగానే జిన్‌పింగ్‌పై సైన్యం తిరుగుబాటు చేసిందా..? మూడోసారి కూడా అధ్యక్షుడిగా కొనసాగాలన్న నిర్ణయంతోనే హౌస్ అరెస్ట్ చేశారా..? ఇందుకు జిన్‌పింగ్ సమర్‌కండ్‌లో ఉన్నప్పుడే కుట్ర జరిగిందా..? అసలు చైనాలో ఏం జరుగుతోంది..? అయితే.. జిన్‌పింగ్ తన పదవిని శాశ్వతం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. చైనాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా జిన్‌పింగ్ కసరత్తు చేస్తున్నారు. చైనా కమ్మూనిస్ట్ పార్టీ 20వ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు అక్టోబర్ 16న ప్రారంభం కానున్నాయి.
ఈ సమావేశాలు జిన్‌పింగ్‌కు ఎంతో ప్రత్యేకమైనవి. అధ్యక్షుడిగా, మిలటరీ అధినేతగా బాధ్యతలు చేపట్టి జిన్‌పింగ్ పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో జిన్‌పింగ్ మూడోసారి పదవిని చేపట్టే దిశగా సభ్యుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మూడోసారి మరో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం అధికారంలో కొనసాగేందుకు సభ్యులు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు జిన్‌పింగ్ క్వారంటైన్‌లో ఉన్నారని వార్తలొస్తున్నాయి. చైనాలో కరోనా నిబంధనల ప్రకారం విదేశాలకు వెళ్లి వచ్చిన వారు కొద్ది రోజులు క్వారంటైన్‌కు వెళ్లాలనే రూల్ ఉంది. అందుకే ఆయన క్వారంటైన్‌లో ఉన్నారని అంటున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్‌ఖండ్‌లో జరిగిన SCO సమ్మిట్ నుంచి తిరిగిరాగానే క్వారంటైన్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక జిన్‌పింగ్ ఇటీవల అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రులకు మరణశిక్ష వేయడంతో పాటు మరో నలుగురు అధికారులకు జీవిత ఖైదు విధించారు. అందుకే జిన్‌పింగ్‌పై సైనిక తిరుగుబాటు జరిగిందని..రాజధాని బీజింగ్ చుట్టూ సైన్యం మోహరించదనే వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ చైనా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఐతే ఈ వార్తలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.