
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరలక్ష్మి శరత్ కుమార్ బిజీగా మారుతోంది. వరసగా సూపర్ హిట్ సినిమాల్లో ఆమె భాగం అవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే క్రాక్, నాంది చిత్రాలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. ఈ రెండు చిత్రాల్లో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా క్రాక్ లో జయమ్మ పాత్ర బాగా హైలైట్ అయింది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు అదే గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ సినిమాను నందమూరి బాలకృష్ణతో చేస్తున్నాడు. నిన్న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది.
గోపీచంద్ మలినేని క్రాక్ సెంటిమెంట్ ను బాలయ్య చిత్రానికి కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. వరలక్ష్మికి మరో పవర్ఫుల్ పాత్రను బాలయ్య చిత్రంలో కూడా ఆఫర్ చేసాడట. బాలయ్యకు ధీటుగా ఈ పాత్ర ఉంటుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.