Homeటాప్ స్టోరీస్రామ్‌చ‌ర‌ణ్ విలన్‌పై న‌టి వనిత ఫైర్‌!

రామ్‌చ‌ర‌ణ్ విలన్‌పై న‌టి వనిత ఫైర్‌!

Vineetha Coments on Ram Charans Villion
Vineetha Coments on Ram Charans Villion

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం `బ్రూస్‌లీ`. ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన యంగ్ అండ్ డైన‌మిక్ గాయ్ అరుణ్ విజ‌య్ ప్ర‌స్తుతం ఆస్తి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయ‌నకు, ఆయ‌న సోద‌రి వనితకు మ‌ధ్య గత కొంత కాలంగా ఆస్తి వివాదం రాజుకుంటోంది.  దీంతో వ‌నితవిజ‌య్‌కుమార్‌ని అరుణ్ విజ‌య్ కుటుంబం దూరం పెడుతూ వ‌స్తోంది. త‌ల్లి మంజుల మ‌రణించిన ద‌గ్గ‌రి నుంచి ఈ వివాదం ఇద్ద‌రి మ‌ధ్య తారా స్థాయికి చేరుకోవ‌డం కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజాగా అన్న అరుణ్ విజ‌య్‌పై సోద‌రి వ‌నిత విజ‌య్‌కుమార్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. నువ్వు సినిమాల్లోనే హీరోవి కానీ నిజ జీవితంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ హీరోవు కావు కాలేవు` అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌నిత పెట్టిన పోస్ట్‌లు వైర‌ల్‌గా మారాయి. త‌న‌ని కుటుంబం వేరుగా చూస్తోంద‌ని, అలా కాకుండా త‌న‌ని అక్కున చేర్చుకోవాల‌ని కోరుతోంది. తండ్రి విజ‌య్‌కుమార్‌ని ఉద్దేశిస్తూ ` ర‌క్త సంబంధాన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ నిర్ల‌క్ష్యం చేయొద్ద‌ని, అలాగే త‌న ప్రేమ‌ని అంద‌రికి పంచాల‌ని కోరింది.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా సోద‌రుడు అరుణ్ విజ‌య్‌పై వ‌నిత విజ‌య్‌కుమార్‌  కాస్త ఘాటుగానే స్పందించింది. కుటుంబంలో ఏమైనా అభిప్రాయ బేదాలుంటే వాటిని స‌రిచేసి అంద‌రిని క‌లుపుకుని పోయే ప్ర‌య‌త్నం చేయాల‌ని, నువ్వొక హీరోవి హీరోలా ప్ర‌వ‌ర్తించు, నీ అభిమానుల‌కు స్ఫూర్తిగా నిలువు. అంతే కానీ వారి దృష్టిలో చెడ్డ‌వాడిగా మారిపోకు అని అరుణ్ విజ‌య్‌కి చుర‌క‌లంటించింది. న‌న్ను ఇంటికి దూరం పెట్ట‌డం వ‌ల్ల నేను చాలా స్ట్రాంగ్ అయ్యానే కానీ ఏ విష‌యంలోనూ కృంగిపోలేద‌ని, న‌న్ను కావాల‌నే నా కుటుంబం చీట్ చేసింద‌ని, ఇప్ప‌టికైనా న‌న్ను ద‌గ్గ‌రికి తీసుకుని నాకు ద‌క్కాల్సింది నాకు తిరిగివ్వాల‌ని అరుణ్ విజ‌య్‌ని ఉద్దేశిస్తూ వ‌నిత విజ‌య్‌కుమార్‌ మండిప‌డటం త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All