
మహర్షి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి ఆ తర్వాత మరో సినిమాను టేకప్ చేయడానికి రెండేళ్లకు పైగానే సమయం పట్టింది. వంశీ పైడిపల్లి ప్రతీ సినిమాకూ ఇలా భారీగా గ్యాప్ వస్తుంటుంది. మహర్షి ముందు కూడా మూడేళ్ళ పాటు బ్రేక్ వచ్చింది. ఇలా సినిమా సినిమాకూ ఇంతింత గ్యాప్ ఎందుకు వస్తోంది అంటే వంశీ తన వీక్నెస్ వల్లే ఆ ఆలస్యం అని పేర్కొన్నాడు.
“నేను కొంత మంది దర్శకుల్లాగా కథలు రాయలేను. నా వద్దకు వచ్చిన కథను ఎంత బాగా ప్రెజంట్ చేయగలను అన్నది ఆలోచిస్తాను కానీ సొంతంగా కథలు రాయలేను. వేరే రైటర్లపై కథల కోసం ఆధారపడాల్సి వస్తుంది. అందుకే నా కెరీర్ లో భారీ గ్యాప్ లు కనిపిస్తాయి” అని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేసాడు వంశీ పైడిపల్లి.
ఈ దర్శకుడు తన నెక్స్ట్ సినిమాను తమిళ టాప్ హీరో విజయ్ తో చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం పట్టాలెక్కడానికి మరో ఏడాది సమయం కచ్చితంగా పడుతుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.