Homeటాప్ స్టోరీస్వాల్మీకి టీజర్ తో అంచనాలు పెంచిన వరుణ్ తేజ్

వాల్మీకి టీజర్ తో అంచనాలు పెంచిన వరుణ్ తేజ్

Valmiki Teaser
Valmiki Teaser

నిన్న సాయంత్రం విడుదలైన వాల్మీకి టీజర్ తో ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురిచేశాడు వరుణ్ తేజ్ . ఈ హీరో కు సాఫ్ట్ ఇమేజ్ ఉంది కానీ వాల్మీకి చిత్రంతో మాత్రం మాస్ ఇమేజ్ రావడం ఖాయమని తేలిపోయింది టీజర్ చూస్తుంటే . వరుణ్ గెటప్ ,డైలాగ్ తో పక్కా మాస్ అనిపిస్తోంది . నిన్న మొన్నటి వరకు వాల్మీకి చిత్రంపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి కానీ ఈ టీజర్ తో మాత్రం ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి .

తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ చిత్రానికి రీమేక్ ఈ వాల్మీకి . హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై నిర్మిస్తున్నారు . 14 రీల్స్ గతకొంత కాలంగా రేసులో లేకుండాపోయింది వరుస ప్లాప్ లతో . అయితే ఈ వాల్మీకి తో హిట్ కొడతాం అన్న ధీమాలో ఉన్నారు . ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13 న విడుదల చేయనున్నారు . అథర్వ , పూజా హెగ్డే , మృణాళిని తదితరులు కీలక పాత్రల్లో నటించారు .

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All