Homeటాప్ స్టోరీస్గ్యాంగ్ లీడర్ కు పెద్ద దెబ్బేసిన గద్దలకొండ గణేష్

గ్యాంగ్ లీడర్ కు పెద్ద దెబ్బేసిన గద్దలకొండ గణేష్

Gang Leader And Gaddalakonda Ganesh
గ్యాంగ్ లీడర్ కు పెద్ద దెబ్బేసిన గద్దలకొండ గణేష్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి), నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాకు పెద్ద దెబ్బ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. గద్దలకొండ గణేష్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో బోర్ కొట్టిందని రివ్యూలు వచ్చినా ఓవరాల్ గా ఈ సినిమాను హిట్ అంటున్నారు. మొదటి రోజు కలెక్షన్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. మాస్ సినిమా కాబట్టి హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ మరింత పెరుగుతాయి అని భావిస్తున్నారు.

ఇప్పుడు ఇదంతా గ్యాంగ్ లీడర్ చిత్రంపై ఎఫెక్ట్ చూపిస్తోందని అంటున్నారు. గ్యాంగ్ లీడర్ చిత్రానికి మొదట పాజిటివ్ టాక్ రాలేదు, సినిమాకు యావరేజ్ రేటింగ్స్ ఇచ్చారు రివ్యూయర్లు. అయినా కానీ వీకెండ్ లో డీసెంట్ గా పెర్ఫర్మ్ చేసింది గ్యాంగ్ లీడర్. మొదటి వారాంతంలో ఈ చిత్రం దాదాపు 14 కోట్ల వరకూ వసూలు చేసింది. అయితే ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ చిత్ర కలెక్షన్స్ నెమ్మదించాయి. వీక్ డేస్ లో కేవలం 5 కోట్లకు పైన వసూలు చేయడంతో తొలి వారంలో గ్యాంగ్ లీడర్ 20 కోట్లు మాత్రమే కూడగట్టగలిగింది. బిజినెస్ 29 కోట్లను అందుకోవాలంటే మరో 9 కోట్లు వసూలు చేయాలి.

- Advertisement -

ఇప్పుడు వాల్మీకికి హిట్ టాక్ రావడం, మరో రెండు వారాల్లో సైరా దండయాత్ర మొదలుకానున్న నేపథ్యంలో గ్యాంగ్ లీడర్ ను ప్లాప్ లిస్ట్ లో వేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All