
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన చిత్రం `వకీల్‌సాబ్. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మించారు. దాదాపు మూడేళ్ల విరామం తరువాత పవర్‌స్టార్ ఈ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తెలుగు నేటివిటీకి అనుగునంగా పవన్ ఇమేజ్‌ని జోడించి మార్పులు చేసిన ఈ చిత్రం ఈ నెల 9న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ నుంచి మూడేళ్ల విరామం తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ ప్రీ రిలీజ్‌బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్టు తెలుస్తోంది. నైజాం 26 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, ఉత్తరాంధ్ర 10.5 కోట్లు బిజినెస్ చేసినట్టు తెలిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 79.35 లక్షలు బిజినెస్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. వరల్డ్ వైడ్‌గా దాదాపుగా 89.85 కోట్ల బిజినెస్ జరిగినట్టు చెబుతున్నారు.
వకీల్‌సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు
నైజాం : 26 కోట్లు
సీడెడ్ : 13 కోట్లు
ఉత్తరాంధ్ర : 10.5 కోట్లు
గుంటూరు : 7.5 కోట్లు
ఈస్ట్ గోదావరి : 7 కోట్లు
వెస్ట్ గోదావరి: 6 కోట్లు
కృష్ణా : 6 కోట్లు
నెల్లూరు : 3.35 కోట్లు
ఏపీ, తెలంగాణ : 79.35 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 5.5 కోట్లు
ఓవర్సీస్ : 5 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ : 89.85 కోట్లు