
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సోమవారం సాయంత్రం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఇదే సమయానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35లో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొని బాణా సంచా కాల్చి హంగామా చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లతో పాటు దర్శకుడు శ్రీరామ్ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానుల చేతుల మీదుగా `వకీల్ సాబ్` ట్రైలర్‌ని రిలీజ్ చేయించారు.
అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “వకీల్ సాబ్` ట్రైలర్ సూపర్బ్‌గా వుంది కదా. ఈ అరుపులు కేకలు లేక మూడు సంవత్సరాలు అయ్యింది. ఈ ట్రైలర్ జస్ట్ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే. లంచ్, డిన్నర్ ఏప్రిల్ 9న చేద్దాం. ట్రైలర్ చూశారు.. మీ అభిమానులంతా హ్యాపీనా.. ఇలాంటి సంతోషం కోసం, పవర్‌స్టార్ ఇలా బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు మూడేళ్లు మనమంతా ఎదురుచూశాం. అ ఎదురుచూపుతకు తెరపడింది. ఏప్రిల్ 9న ఇదే థియేటర్‌లో లంచ్, డిన్నర్ కలిసి చేద్దాం` అన్నారు.