
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న చిత్రం `వకీల్‌సాబ్`. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ సోల్‌ని మాత్రమే తీసుకుని దానికి పవర్‌స్టార్ ఇమేజ్‌కి తగ్గ సన్నివేశాల్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌ని ఏప్రిల్ 3న యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. అయితే సెక్యూరిటీ కారణాల దృష్ట్యా తెలంగాణ పోలీస్ చిత్ర బృందానికి అనుమతి నిరాకరించారు. అయితే తాజాగా ఈ ఈవెంట్‌కి మరో ప్లేస్‌ని, మరో డేట్‌ని చిత్ర బృందం ఫిక్స్ చేసినట్టు తెలిసింది.
పవర్‌స్టార్ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి భారీ స్థాయిలో హాజరయ్యే అవకాశం వుండటంతో ఈ ఈవెంట్‌ని హైటెక్స్‌కి మార్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే కాకుండా ఏప్రిల్ 4న ఈ భారీ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నట్టు తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.