Homeటాప్ స్టోరీస్`వ‌కీల్‌సాబ్` ఫ‌స్ట్ సింగిల్ టీజ‌ర్ కుమ్మేస్తోందిగా!

`వ‌కీల్‌సాబ్` ఫ‌స్ట్ సింగిల్ టీజ‌ర్ కుమ్మేస్తోందిగా!

`వ‌కీల్‌సాబ్` ఫ‌స్ట్ సింగిల్ టీజ‌ర్ కుమ్మేస్తోందిగా!
`వ‌కీల్‌సాబ్` ఫ‌స్ట్ సింగిల్ టీజ‌ర్ కుమ్మేస్తోందిగా!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కెరీర్ 2019కి ముందు ఆ త‌రువాత అని రాయాలేమో. కెరియ‌ర్ స్టార్ట్ చేసిన ద‌గ్గ‌రి నుంచి `అజ్ఞాత‌వాసి` వ‌ర‌కు ప‌వ‌న్ ఏడాది కేవ‌లం ఒక్క సినిమా మాత్ర‌మే చేస్తూ వ‌చ్చారు. ఏపీ రాజ‌కీయాల కార‌ణంగా రెండేళ్లు సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చిన ప‌వ‌న్ తాజాగా స్పీడు పెంచారు. ఏడాదికి రెండు లేదా మూడు నాలుగు చిత్రాల్ని చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం `వ‌కీల్‌సాబ్‌`.

బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల విడుద‌లై ఇంట‌ర్నెట్‌ని షేక్ చేసింది. టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ నెల 8న ఉద‌యం 10 గంట‌ల‌కు రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన `మ‌గువా మ‌గువా.. లోకానికి తెలుసా నీ విలువా..` అంటూ సాగే పాట‌ని రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -

షాంపిల్‌గా ఈ పాట‌కు సంబంధించిన సాంగ్ టీజ‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. క్రేజీ సింగ‌ర్ సిడ్ శ్రీ‌రామ్ ఆల‌పించిన ఈ సాంగ్ టీజ‌ర్ సోష‌ల్ మీడియాతో పాటు యూట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సాంగ్ టీజ‌రే ఈ రేంజ్‌లో ర‌చ్చ‌ చేస్తే 8న ఉద‌యం రిలీజ్ కాబోతున్న ణుల్ లిరిక‌ల్ వీడియో ఇంకా ఎంత ర‌చ్చ చేస్తుందో చూడాలి అంటున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All