Homeటాప్ స్టోరీస్`వి` ఇంద్ర‌గంటి రేంజ్‌ని మార్చేస్తుందా?

`వి` ఇంద్ర‌గంటి రేంజ్‌ని మార్చేస్తుందా?

`వి` ఇంద్ర‌గంటి రేంజ్‌ని మార్చేస్తుందా?
`వి` ఇంద్ర‌గంటి రేంజ్‌ని మార్చేస్తుందా?

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌… టాలీవుడ్ ట్రెండ్‌కి సంబంధం లేకుండా త‌న స్కూల్ లో సినిమాలు చేసుకుంటూ వేళ్లే సాధార‌ణ ద‌ర్శ‌కుడు. చిన్న చిన్న చిత్రాలు.. త‌న మార్కు వినోదంతో ఫ్యామిలీ చూడ‌ద‌గ్గ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌ని అందిస్తూ వ‌స్తున్నారు. భారీ సినిమాలు, స్టార్ కాస్ట్‌తో ప‌నిచేయ‌డం వంటివి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేయ‌లేద‌నే చెప్పాలి. బ‌డ్జెట్‌ని, క‌థ‌ని బ‌ట్టి త‌న ప‌రిథిమేర‌కు సినిమాలు చేస్తూ వ‌స్తున్న ఆయ‌న `వి` సినిమాతో ఒక్క‌సారిగా త‌న స్థాయిని మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

బ‌డ్జెట్‌, మేకింగ్ ప‌రంగా `వి` చిత్రం ఇంద్ర‌గంటి గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా క‌నిపిస్తోంది. నాని ఇంత‌కు ముందు ఇంద్ర‌గంటితో అష్టాచ‌మ్మా, జెంటిల్‌మ‌న్ వంటి చిత్రాలు చేసినా తాజాగా ఆయ‌న స్థాయి మారింది. ఆయ‌న సినిమాల బ‌డ్జెట్ స్థాయి కూడా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన `వి` మూవీ, ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్‌, తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం విడుద‌ల చేసిన ట్రైల‌ర్ ఓ రేంజ్ ఫిల్మ్ అనే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. ఇదే విష‌యాన్ని ఇట‌వ‌ల ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా మీడియాతో ముచ్చ‌టించిన ఇంద్ర‌గంటి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

- Advertisement -

ఇంత వ‌ర‌కు నేను చేసిన సినిమాల‌తో పోలిస్తే స్టైల్ ప‌రంగా, మేకింగ్ ప‌రంగా `వి` నాకొక ఛాలెంజింగ్ ఫిల్మ్‌. దీన్ని ఐదు రాష్ట్రాల‌తో పాటు థాయ్‌లాండ్‌లోనూ చిత్రీక‌రించాం. ఇంత‌కు ముందు నా సినిమాల‌ను నేనింత భారీగా చేయ‌లేదు. ఇంత వ‌ర‌కు నేను చేసిన సినిమాల్లో `వి` నెక్ట్స్ రేంజ్ సినిమా అని ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. `వి` ఓ మిస్ట‌రీ యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ డ్రామా. అన్ని వ‌ర్గాల వారిని మెప్పించేలా వుంటుంది` అని ఇంద్ర‌గంటి చెబుతున్నారు. క్లైమాక్స్ చూస్తే సీక్వెల్ వుంటుందా? అనే ఆలోచన వ‌స్తుంద‌ని అయితే తాను ఇంకా సీక్వెల్ గురించి ఆలోచించ‌లేద‌ని చెప్పారు. థియేట‌ర్లు తెరిచే విష‌యంలో ఇప్ప‌టికీ క్లారిటీ లేక‌పోవ‌డం వ‌ల్లే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామ‌న్నారు ఇంద్ర‌గంటి. థియేట‌ర్ అనుభ‌వం గురించి మాట్లాడుతూ `నాకు సినిమాల్ని థియేట‌ర్ల‌లో చూడ‌మే ఇష్టం అని, ఆ అనుభ‌వాన్ని ఎవ‌రూ కాద‌నుకుంటార‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితులు అందుకు ఇబ్బందిక‌రంగా మారాయ‌న్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All