Wednesday, December 7, 2022
Homeగాసిప్స్వెబ్ సిరీస్‌ల నిర్మాణంలోకి ప్ర‌భాస్ ప్రొడ్యూస‌ర్స్‌?

వెబ్ సిరీస్‌ల నిర్మాణంలోకి ప్ర‌భాస్ ప్రొడ్యూస‌ర్స్‌?

వెబ్ సిరీస్‌ల నిర్మాణంలోకి ప్ర‌భాస్ ప్రొడ్యూస‌ర్స్‌?
వెబ్ సిరీస్‌ల నిర్మాణంలోకి ప్ర‌భాస్ ప్రొడ్యూస‌ర్స్‌?

క‌రోనా కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీ మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. లాక్ డౌన్ స‌డ‌లింపులు ఇచ్చినా సినిమా షూటింగ్‌లు మాత్రం జ‌ర‌గ‌డం లేదు. దీంతో చాలా వ‌ర‌కు హీరోలు, ద‌ర్శ‌కులు ఓటీటీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో అనుష్క‌, అజ‌య్ దేవ‌గ‌న్ వంటి స్టార్స్ ఓటీటీల‌కు వెబ్ సిరీస్‌ల‌ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ప్ర‌భాస్ ప్రొడ్యూస‌ర్స్ చేర‌బోతున్నారు.

- Advertisement -

ప్ర‌భాస్‌తో ప్ర‌స్తుతం భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ యువీ క్రియేష‌న్స్‌. ఈ మూవీ నిర్మాణ ద‌శ‌లో వుండ‌గానే వెబ్ సిరీస్‌ల నిర్మాణానికి అడుగులు వేస్తున్న‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ `ఆహా` పేరుతో మైహోమ్ రామేశ్వ‌ర‌రావుతో క‌లిసి ఓటీటీని ప్రారంభించి వ‌రుస వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ఇదే త‌ర‌హాలో యువీ సంస్థ కూడా వెబ్ సిరీస్‌ల‌ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

ఇందు కోసం తాజాగా వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ని సంప్ర‌దించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. పూరీతో పాటు `సాహో` ఫేమ్ సుజిత్‌ని కూడా సంప్ర‌దించిన యువీ మేక‌ర్స్ ఈ ఇద్ద‌రితో భారీ వెబ్ సిరీస్‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుపుతున్న యువీ త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts