Homeటాప్ స్టోరీస్పాండ్యా ఎంగేజ్‌మెంట్‌పై మాజీ ప్రేయ‌సి కామెంట్‌!

పాండ్యా ఎంగేజ్‌మెంట్‌పై మాజీ ప్రేయ‌సి కామెంట్‌!

పాండ్యా ఎంగేజ్‌మెంట్‌పై మాజీ ప్రేయ‌సి కామెంట్‌!
పాండ్యా ఎంగేజ్‌మెంట్‌పై మాజీ ప్రేయ‌సి కామెంట్‌!

ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ హార్ధిక్ పాండ్యా శ‌నివారం అందిరికి షాకిచ్చారు. ఇంట్లో వాళ్ల‌కి కూడా చెప్ప‌కుండా త‌న‌కు న‌చ్చిన న‌టాషా స్టాంకోవిక్ తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌తో పాటు ఓ వీడియోని కూడా పాండ్యా సోష‌ల్ మీడియా ఇన్‌స్టా ద్వారా అభిమానుల కోసం షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `మై తెరా, తు మేరా జాన్‌.. సారా హిందుస్థాన్‌. జ‌న‌వ‌రి 1న ఎంగేజ్డ్‌` అని వెల్ల‌డిస్తూ న‌టాషాతో క‌లిసి దిగిన ఫొటోని పోస్ట్ చేశారు హార్ధిక్ పాండ్యా.

దీంతో అత‌నిపై సోస‌ల్‌మీడియాలో కామెంట్‌ల వ‌ర్షం కురుస్తోంది. కొంత మంది కొత్త‌గా జంట కాబోతున్న హ‌ర్థిక్ పాండ్యా, న‌టాషాల‌కు శుభాకాంక్ష‌లు తెల‌యిజేస్తుంటే మ‌ని కొంత మంది కంగ్రాట్స్ చెబుతూ ల‌వ్ ఎమోజీల‌ని పోస్ట్ చేస్తున్నారు. అయితే ఓ బాలీవుడ్ హ‌టీ ఊర్వ‌శీ రౌతేలా మాత్రం ఈ జంట‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. `మీ ఎంగేజ్‌మెంట్‌కి నా శుభాకాంక్ష‌లు. మీ బంధం ఎల్ల‌ప్పుడు అనంత‌మైన ప్రేమ‌తో, సంతోషంతో నిత్యం ఆనందంగా సాగాల‌ని కోరుకుంటున్నాను. అద్భుత‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌బోతున్న మీ జంట‌ని మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాను` అని ప్ర‌శంస‌లు కురిపించింది.

- Advertisement -

ఊర్వ‌శి ఇంత‌గా పాండ్యా జంట‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం వెన‌క వేరే క‌థ వుంద‌ని, ముందు పాండ్యా ప్రేమించింది. డేటింగ్ చేసింది ఊర్వ‌శితోనే అని, ఆ బాధ‌ని క‌ప్పిపుచ్చుకోవ‌డం కోస‌మే ఊర్వ‌శి పైకి పాండ్యా జంట‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తోంద‌ని బాలీవుడ్ జ‌నాలు అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All