Homeగాసిప్స్ఉప్పెన క్లైమాక్స్ ఏడిపించేస్తారటగా!

ఉప్పెన క్లైమాక్స్ ఏడిపించేస్తారటగా!

ఉప్పెన క్లైమాక్స్ ఏడిపించేస్తారటగా!
ఉప్పెన క్లైమాక్స్ ఏడిపించేస్తారటగా!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన అనే సినిమా ప్రకటించిన విషయం తెల్సిందే. గత ఏడాది ప్రకటించిన ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది. ఒక రా సబ్జెక్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు ఈ సినిమాకు దర్శకుడు. హీరో మత్స్యకారుడు. వారి జీవన విధానాన్ని చూపిస్తూనే, సాధారణంగా ప్రతి తెలుగు సినిమాలో ఉండే ధనిక అమ్మాయి – పేద అబ్బాయి తరహా లవ్ స్టోరీ కూడా ఇందులో ఉంటుందిట. హీరోకు, విలన్ కు మధ్య వచ్చే గొడవలు.. ఇలా కమర్షియల్ అంశాలను పాటిస్తూనే రా గా సినిమాను చూపిస్తున్నారని సమాచారం. లవ్ స్టోరీ ఫార్మాట్ ఓల్డ్ దే అయినా ఇందులో వచ్చే సన్నివేశాలు సరికొత్తగా ఉంటాయని చెబుతున్నారు. ఇంతవరకూ బానే ఉంది కానీ రా గా ఉండే ఈ సినిమాలో క్లైమాక్స్ తెలుగు సినిమాకు ఉన్న కొన్ని పరిమితులని చెరిపేస్తుందని అంటున్నారు. అంత రా గా ఉంటుందని, అసలు ఈ తరహా క్లైమాక్స్ ను తెలుగు ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదోనన్న డౌట్ కూడా చిత్ర యూనిట్ కు కలుగుతోందిట.

అయినా కూడా అధైర్యపడకుండా సబ్జెక్ట్ ను నమ్మి ముందుకెళుతున్నారని తెలుస్తోంది. చూస్తుంటే ఇందులో యాంటీ క్లైమాక్స్ తరహాదేమైనా ప్లాన్ చేశారేమో. తెలుగు ప్రేక్షకులు యాంటీ క్లైమాక్స్ అంటే ఫర్లాంగ్ దూరం పరిగెడతారు. మరి ఈ సినిమాలో యాంటీ క్లైమాక్స్ ను ఒప్పుకుంటారా? ఏదేమైనా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతో సేఫ్ గేమ్ ఆడకుండా ఇలా విభిన్నంగా తెరకెక్కే స్టోరీని ఎన్నుకోవడం అభినందనీయమే.

- Advertisement -

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సుకుమార్ సమర్పిస్తున్నాడు. సుకుమార్ కు ఈ కథ మీద ఉండే నమ్మకమే ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యేలా చేసిందని చెప్పవచ్చు. ఒకవైపు మైత్రి మూవీస్ పరిస్థితి ఏమంత బాలేదు. గత ఏడాది నుండి వీరి ప్రొడక్షన్ లో వచ్చిన మిడ్ రేంజ్ సినిమాలన్నీ వరసపెట్టి టప్పా కట్టేస్తున్నాయి. మరి ఉప్పెన ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All