Homeటాప్ స్టోరీస్యంగ్ మెగా హీరో సినిమా రిలీజయ్యేది అప్పుడే?

యంగ్ మెగా హీరో సినిమా రిలీజయ్యేది అప్పుడే?

యంగ్ మెగా హీరో సినిమా రిలీజయ్యేది అప్పుడే?
యంగ్ మెగా హీరో సినిమా రిలీజయ్యేది అప్పుడే?

యంగ్ మెగా హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఏప్రిల్ 2న సినిమా విడుదలకు సిద్ధం చేసుకుంది. అయితే కరోనా కారణంగా రిలీజ్ చేయడం కుదర్లేదు. ఇక ఎన్నాళ్ళు అయినా థియేటర్లు తెరుచుకోవట్లేదు. నాలుగు నెలలు అవుతోంది థియేటర్లు మూసి వేసి. మరో రెండు లేదా మూడు నెలలు పరిస్థితి ఇలానే ఉండే అవకాశముంది. దాంతో ఉప్పెన చిత్రాన్ని డైరెక్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అందరూ నిజమేనని అనుకున్నారు కూడా. అయితే చిత్ర టీమ్ ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని తెలిపింది. ఇన్నాళ్లు అయినా ఎదురుచూసి ఉప్పెనను థియేటర్లలోనే విడుదల చేస్తామని అన్నారు.

తాజా సమాచారం ప్రకారం ఉప్పెన వచ్చే సంక్రాంతికి విడుదలవుతుందని తెలుస్తోంది. అప్పటికి ఎలాగు థియేటర్లు తెరుచుకుంటాయని భావిస్తున్నారు. సో సంక్రాంతి సీజన్ లో విడుదల చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందనిఅనుకుంటున్నారు.

- Advertisement -

వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి బుచ్చి బాబు దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా సుకుమార్ సమర్పించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All