Homeటాప్ స్టోరీస్బేబమ్మా... కోసం “ఉప్పెన”లా వస్తున్న ప్రేమికుడు

బేబమ్మా… కోసం “ఉప్పెన”లా వస్తున్న ప్రేమికుడు

బేబమ్మా... కోసం “ఉప్పెన”లా వస్తున్న ప్రేమికుడు
బేబమ్మా… కోసం “ఉప్పెన”లా వస్తున్న ప్రేమికుడు

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో కథానాయకుడు వైష్ణవ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుండి ఆల్రెడీ సుప్రీం హీరో సాయి తేజ్ విజయవంతమైన హీరోగా కంటిన్యూ అవుతున్నారు. వైష్ణవ తేజ్ ఆయన సోదరుడు. అయితే “ఉప్పెన” సినిమాకు పంజా వైష్ణవ్ తేజ్ గా తెరంగేట్రం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి “ఉప్పెన ఫస్ట్ వేవ్” అనే చిన్న ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసారు.

ఈ వీడియోలో సముద్రపు అలల హోరులో ప్రవాహానికి ఎదురుగా నిలబడి బేబమ్మా…! అంటూ హీరోయిన్ ని పిలుస్తూ ఉంటాడు హీరో. కట్ చేస్తే, బస్ కిటీకీ లో విండో సీట్ నుండి దుప్పట్టా కవర్ చేస్తున్న సగం కనపడే హీరోయిన్ ఫేస్ రివీల్ చేసారు. ఈ షాట్ లో హీరోయిన్ కళ్ళతో పలికించే భావాలు హైలెట్. మిగిలిన సినిమాలకు చినుకులు రాల్చే దేవీశ్రీ ప్రసాద్ ఎందుకో తెలియదు.? ఉప్పెన కురిపిస్తాడు. ఈ బిట్ లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగుంది

- Advertisement -

సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇక సుకుమార్ రైటింగ్స్ & మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో “మక్కల్ సెల్వన్” విజయ్ సేతుపతి ప్రతినాయకునిగా చేస్తున్నారనే వార్తలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 2 న రిలీజ్ చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All