Homeటాప్ స్టోరీస్ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ ఫ‌స్ట్‌లుక్‌!‌

ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ ఫ‌స్ట్‌లుక్‌!‌

ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ ఫ‌స్ట్‌లుక్‌!‌
ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ ఫ‌స్ట్‌లుక్‌!‌

క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర న‌టిస్తున్న బ‌హు భాషా చిత్రం `క‌బ్జా`. ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ సిద్దేశ్వ‌ర ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై ఆర్‌. చంద్రు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళభాష‌ల్లో విడుద‌ల కానుంది. బ్రహ్మ‌, ఐ ల‌వ్ యూ చిత్రాల త‌రువాత ఉపేంద్ర‌, చంద్రుల క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్ర‌మిది.

ఇండియాకు స్వాతంత్య్రం వ‌చ్చిన 1947 నుంచి 1980 మ‌ధ్య కాలంలో సాగే క‌థ‌తో అండ‌ర్ వ‌ర‌ల్డ్ నేప‌థ్యంలో భారీ బ‌డ్జెట్‌తో మొత్తం ఏడు భార‌తీయ భాష‌ల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు వెర్ష‌న్‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర బృందం శుక్ర‌వారం విడుద‌ల చేసింది. య‌జ్డీ బైక్‌పై రెట్రో లుక్‌లో క‌నిపిస్తున్న ఉపేంద్ర లుక్ ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ `క‌బ్జా` ఫ‌స్ట్ లుక్‌కు మంచి స్పంద‌న రావ‌డం ఆనందంగా వుంది. సినిమాకూ ఇదే త‌ర‌హా స్పంద‌న ల‌భిస్తుంద‌ని న‌మ్ముతున్నాను.  హీరో పాత్ర చిత్ర‌ణ‌, అందులో ఉపేంద్ర న‌ట‌న సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తుంది‌. ఇప్ప‌టి వ‌ర‌కు 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.  క‌రోనా కార‌ణంగా చిత్రీక‌ర‌ణకు విరామం ఇచ్చాం. దేశంలో మ‌ళ్లీ సాధార‌ణ ప‌రిస్థితులు మొద‌లైన త‌రువాత అంతా మ‌ళ్లీ షూటింగ్‌లు ప్రారంభించిన త‌రువాతే మేమూ మొద‌లుపెడ‌తాం. దాదాపు 70 నుంచి 80 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ఏడు భాష‌ల్లో విడుద‌ల చేస్తాం. జ‌ప‌తిబాబు సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు‌. ఉపేంద్ర స‌ర‌స‌న  అగ్ర హీరోయిన్ న‌టిస్తారు. ఆవిడ ఎవ‌ర‌నేది త్వ‌ర‌లో చెబుతాం` అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All