Homeటాప్ స్టోరీస్యూత్‌కు... లేడీస్‌కు... న‌చ్చే సినిమా 'ఐ ల‌వ్ యు'

యూత్‌కు… లేడీస్‌కు… న‌చ్చే సినిమా ‘ఐ ల‌వ్ యు’

- Advertisement -

ఓం‘, ‘‘, ‘సూపర్వంటి భారీ బ్లాక్ బస్టర్స్‌తో తెలుగులో సంచలనం సృష్టించిన కన్నడ కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర. ఆయన సినిమా తెలుగులో విడుదలవుతుందటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. తెలుగు బాక్సాఫీస్ ను ఆయన సినిమాలు షేక్ చేసిన సందర్భాలెన్నో. కొత్త విరామం తరవాత మరోసారి తెలుగులో తన సినిమాను విడుదల చేస్తున్నారు ఉపేంద్ర.

ఉపేంద్ర హీరోగా నటించిన తాజా సినిమాఐ లవ్ యు‘. ‘నన్నేప్రేమించుఅనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకుకృష్ణమ్మ కలిపింది ఇద్దరినీతో దర్శకుడిగా పరిచయం అయిన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 14న సినిమాను విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి విశాఖ తీరంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.   

ఉపేంద్ర మాట్లాడుతూ “విశాఖపట్టణం అందమైన ప్రదేశం. ఇక్కడికి వచ్చాక థ్రిల్లయ్యా. ఇక్కడి ప్రజలు అదృష్టవంతులు. శని, ఆదివారాలు బీచ్ లో ఎంజాయ్ చేయవచ్చు. ఈ వాతావరణం చాలా బాగుంది. అంతకు మించి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఇంకా బాగున్నాయి. చంద్రుగారితో నా కాంబినేషన్‌లోఐ లవ్ యుసెకండ్ ఫిల్మ్. ‘రాగా ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి లేడీస్ ఫిల్మ్ అవుతుంది. అంత అందమైన, ఏమీ కోరని ప్రేమ గురించి చెప్పే సినిమా ఇది. నా సినిమాల తరహాలో రెగ్యులర్ లవ్, పోస్ట్ మార్టమ్ సన్నివేశాలు ఉంటాయి. ఎక్స్‌ట్రాడిన‌రీ ఎమోష‌న‌ల్ మూవీ. తప్పకుండా భార్యాభర్తలు వచ్చి సినిమా చూడాలి. ఫస్ట్ యూత్ ఆడియన్స్ అందరూ రండి. తరవాత భార్యాభర్తలను పంపండి. ప్రేమ అంటే ఏంటి? నిజమైన ప్రేమను ఎలా చూపించాలి? అనే చక్కటి సందేశంతో చేసిన చిత్రమిది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్, పంచ్ డైలాగ్స్ ఉంటాయి.   

ఆర్. చంద్రు మాట్లాడుతూ “నేను విశాఖపట్టణం రావడం ఇది రెండోసారి. గంటా శ్రీనివాసరావుగారు వాళ్ళబ్బాయి రవితో సినిమా చేయాలని ఫోన్ చేయడంతో తొలిసారి వచ్చాను. మలయాళప్రేమమ్రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ, కుదరలేదు. భవిష్యత్తులో తప్పకుండా రవితో సినిమా చేస్తాను. ఈ సినిమా విషయానికి వస్తే…. ఉప్పీ సార్‌బ్రహ్మచేశాను. ఇప్పుడీఐ లవ్ యురెండో సినిమా. తెలుగులో కూడా నా రెండో సినిమా ఇది. ఇంతకు ముందు ల్యాంకో హిల్స్ శ్రీధర్ తెలుగులోకృష్ణమ్మ కలిపింది ఇద్దరినీనా తొలి సినిమా. గొప్ప నటుడు, దర్శకుడు అయిన ఉపేంద్రగారితో డిస్క్స్ చేసి ఈ సినిమా చేశా. ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ఉదాహరణకుటీనేజ్‌లో మన ప్రేమను  ఎవరికి చెప్పాలో? ఎలా చెప్పాలో? తెలియక చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటారు. ‘ఐ లవ్ యుఎక్కడ.. ఎవరికిఎలాచెప్పాలనే సందేశంతో రూపొందించిన చిత్రమిది. అలాగే, ఉపేంద్ర సార్ క్యారెక్ట‌రైజేష‌న్ మ‌స్త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎమోష‌న్‌తో ప్రతి ఒక్కరూ క్లైమాక్స్‌లో లేచి క్లాప్స్ కొట్టేలా ఉంటుంది. ప్రామిస్ చేస్తున్నాక్లైమాక్స్‌లో ప్రతి ఒక్కరూ ఫోన్ చేసిఐ లవ్ యుఅని చెప్తారు. జూన్ 14న సినిమా విడుదల కానుంది. ఉపేంద్రగారితో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనిపిస్తుంది. కుదిరితే ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకు ఒకసారి ఉప్పీ సార్ తో సినిమా చేయాలనుకుంటున్నాఅని అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ డా. కిరణ్ తోటంబైల్ మాట్లాడుతూ “ఒక పెద్ద సినిమాకు నేను సంగీతం అందించడం ఇదే తొలిసారి. ఉపేంద్ర సార్, రచితా రామ్, కన్నడలో స్టార్ దర్శకుడు ఆర్. చంద్రు కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరూ సినిమా చూసి మాకు మద్దతు ఇవ్వాలని, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానుఅని అన్నారు.

సోను గౌడ మాట్లాడుతూ “అందరికీ నమస్కారం. నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. ఉపేంద్ర సార్, చంద్రు సార్‌తో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. కన్నడతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదలవుతోంది. ఇదే నా తొలి తెలుగు సినిమా. ప్లీజ్సినిమా చూడండి. పాటలు, ట్రైల‌ర్‌లో నేను కనిపించలేదు. అందువల్ల, సినిమాలో నా క్యారెక్టర్ ఏంటనేది మీకు తెలియదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశా. అదేంటో సస్పెన్స్. సినిమా చూస్తే నా క్యారెక్ట‌ర్‌కి ఉన్న‌ ఇంపార్టెన్స్ తెలుస్తుందిఅని అన్నారు

కెజిహెచ్ హాస్పిటల్ సూప‌ర్‌డెంట్‌ డా. అర్జున మాట్లాడుతూ “ఉపేంద్రగారిఐ లవ్ యుమూవీ పాటల విడుదల కార్యక్రమం విశాఖలో జరగడం సంతోషంగా ఉంది. ఉపేంద్రగారి సినిమాలు ఎనర్జిటిక్ గా ఉంటాయి. విశాఖలో సినిమా షూటింగ్ చేసినాఆడియో, ప్రీ రిలీజ్ వేడుకలు జరిగినాఆ సినిమా సూపర్ హిట్టే. చిత్ర బృందానికి మంచి పేరు తీసుకొస్తాయిఅని అన్నారు

సోను గౌడ, బ్రహ్మానందం, హోనవళ్ళి కృష్ణ, జై జగదీష్‌, పీడీ సతీష్‌ తదితరులు నటించిన ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి

పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడుఫణి కందుకూరి 

స్టంట్స్‌: గణేష్, వినోద్, డా. కే రవి వర్మ 

కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన (ఉపేంద్ర), తేజస్విని (రచితా రామ్)

కాస్ట్యూమర్: గండశి నాగరాజ్

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మునీంద్ర కె. పుర

ఎడిటర్‌: దీపు ఎస్‌. కుమార్‌

లైన్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ సూర్య

ఆర్ట్‌ డైరెక్టర్‌: మోహన్‌ బి. కేరే

గాయకులు: ఉపేంద్ర, అర్మాన్ మాలిక్, విజయ్ ప్రకాష్, హేమంత్ మను కోకిల, శ్రేయా ఘోషల్, వాణి హరికృష్ణ

కొరియోగ్రఫీ: చిన్ని ప్రకాష్‌, ధను, మోహన్‌

లిరిక్స్: డా చల్లా భాగ్యలక్ష్మి 

సినిమాటోగ్రఫీ: సుజ్ఞాన్ 

మ్యూజిక్‌ డైరెక్టర్‌: డా. కిరణ్‌ తోటంబైల్‌

రచన, నిర్మాణం, దర్శకత్వం: ఆర్‌. చంద్రు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts