Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ కోసం ఉపేంద్ర‌ని దించేస్తున్నారా?

ఎన్టీఆర్ కోసం ఉపేంద్ర‌ని దించేస్తున్నారా?

ఎన్టీఆర్ కోసం ఉపేంద్ర‌ని దించేస్తున్నారా?
ఎన్టీఆర్ కోసం ఉపేంద్ర‌ని దించేస్తున్నారా?

క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర‌కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఆయ‌న న‌టించిన ఓం, ఉపేంద్ర వంటి చిత్రాలు తెలుగులోనూ సూప‌ర్ హిట్‌లుగా నిలిచాయి. దీన్ని గ‌మ‌నించిన మ‌న తెలుగు స్టార్ డైరెక్ట‌ర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఆయ‌న‌తో `స‌న్నాఫ్ స‌త్యమూర్తి`లో దేవ‌రాజ్ వంటి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ని చేయించారు. ఈ మూవీ బ‌న్నీకి మంచి విజ‌యాన్ని అందించింది.

మ‌రోసారి క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర‌ని త్ర‌విక్ర‌మ్ త‌న తాజా చిత్రం కోసం అడుగుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే .. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ‌, హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు.

- Advertisement -

ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రారంభం కాబోతోంది. పొలిటిక‌ల్ నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ మూవీలో మెయిన్ విల‌న్‌గా క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర‌ని సంప్ర‌దిస్తున్నార‌ట‌. క్యారెక్ట‌ర్ ఆస‌క్తిక‌రంగా వుండ‌టంతో ఉపేంద్ర కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All