Homeటాప్ స్టోరీస్రామ చిలుక రక్ష‌ణ‌కు మెగా కోడ‌లు!

రామ చిలుక రక్ష‌ణ‌కు మెగా కోడ‌లు!

రామ చిలుక రక్ష‌ణ‌కు మెగా కోడ‌లు!
రామ చిలుక రక్ష‌ణ‌కు మెగా కోడ‌లు!

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌ణ్య ప్రాణి సంర‌క్ష‌ణ కోసం వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్‌గా వున్నవైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫ‌ర్స్‌తో క‌లిసి వ‌ణ్య ప్రాణి సంర‌క్ష‌ణ కోసం ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా `వైల్డెస్ట్ డ్రీమ్స్‌` పేరుతో ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి ప్ర‌త్యేకంగా ఎగ్జిబిష‌న్‌ని ఏర్పాటు చేశారు.

దీన్ని ఇటీవ‌ల ప‌లువురు తార‌ల్ని సంద‌ర్శించి రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల్ని అభినంద‌న‌ల్లో ముంచేశారు. ఈ ఉద్య‌మాన్ని ప్ర‌శంస‌ల వ‌రకే ఆప‌కుండా చేత‌ల్లో చూపించ‌డం మొద‌లుపెట్టారు రామ్‌చ‌ర‌న్ వైఫ్ ఉపాస‌న. ఏపీలోని రామ చిలుక‌, కృష్ఱ జింక‌ల సంర‌క్ష‌ణ‌కు ఆమె న‌డుంక‌ట్టారు. ముందు రామ చిలుక‌ని ర‌క్షించే ప‌రిలో ప‌ట్టారు. ఎంతో అందంగా క‌నిపించే రామ చిలుక‌ని ఇక‌పై పంజ‌రంలో పెడితే త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చిరించారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ఆమె సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా ఓ సందేశాన్ని అందించారు. రామ చిలుక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌క్షి. దీన్ని పంజ‌రంలో బంధిస్తే 5000 జ‌రిమానా త‌ప్ప‌ద‌ని, ఆరేళ్ల జైలు శిక్ష‌ని కూడా అనుభ‌వించాల్ని వుంటుంద‌ని వెల్ల‌డించింది. అందంగా ముద్దు ముద్దుగా ప‌లికే రామ చిలుక పెట్టింది స్వేచ్ఛ‌గా జీవించ‌డానిక‌ని, పంజ‌రంలో బంధీగా వుండ‌టానికి కాద‌ని, ఎవ‌రైనా దాన్ని బంధించినా ఆ సమాచారాన్ని వెంట‌నే త‌మ‌కు తెలియ‌జేయాల‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఉపాస‌న పెట్టిన ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All