Homeటాప్ స్టోరీస్ఈ భామకు బ్లాక్ బస్టర్ యోగం లేదా ?

ఈ భామకు బ్లాక్ బస్టర్ యోగం లేదా ?

పూజా హెగ్డే ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ ఘోర పరాజయం పొందడమో లేక యావరేజ్ అవ్వడమే తప్పితే ఒక్కటంటే ఒకటి కూడా బ్లాక్ బస్టర్ లేకుండా పోయింది . తెలుగులో ”ఒక లైలా కోసం ” అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ భామ , అది అంతగా ఆడలేదు అలాగే ముకుంద , కూడా ప్లాప్ అయ్యింది . అయితే అల్లు అర్జున్ తో నటించిన దువ్వాడ జగన్నాథం బాగానే ఆడింది కానీ అది చేసిన బిజినెస్ తో పోల్చుకుంటే హిట్టేమీ కాదు అలా దువ్వాడ మిస్ అయ్యింది హిట్ ఖాతాలోంచి .

- Advertisement -

ఆ తర్వాత రంగస్థలం చిత్రంలో ఐటెం భామగా మెరిసింది కానీ రంగస్థలం క్రెడిట్ పూజా హెగ్డే కు దక్కదు ఎందుకంటే హీరోయిన్ కాదు కదా ! ఇక అరవింద సమేత లో నటించింది కానీ ఆ సినిమా వసూళ్లు బయ్యర్లకి లాభాలు తెచ్చిపెట్టలేదు కానీ భారీ ఓపెనింగ్స్ ని మాత్రమే తెచ్చిపెట్టాయి దాంతో అది కూడా సాలిడ్ హిట్ కాదు . ఇక ఇప్పుడేమో మహేష్ బాబు తో మహర్షి చిత్రంలో నటించింది . కథ బాగుంది కానీ చాలామంది పెదవి విరుస్తున్నారు దాంతో మహర్షి సాలిడ్ హిట్టా ? కదా ? అన్నది తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగితే కానీ తెలీదు . దాంతో ఈ భామకు సాలిడ్ గా బ్లాక్ బస్టర్ పడే యోగం ఉందా ? అన్న అనుమానం నెలకొంది

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All