Homeటాప్ స్టోరీస్తెలంగాణా R.T.C సమ్మె – అసలు నిజాలు

తెలంగాణా R.T.C సమ్మె – అసలు నిజాలు

telangana tsrtc strike
telangana tsrtc strike

తెలంగాణా లో RTC సమ్మె మొదలై నెల రోజులు దాటిపోయింది. RTC ని ప్రభుత్వ విలీనంతో పాటు, జీతాలు, ఇంక్రిమెంట్ల పెంపు వంటి 26 డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు ఉంచారు. కానీ అలా చేస్తే తర్వాత సుమారు 56 ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా విలీనానికి పట్టుబడితే ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థ మొయ్యలేని భారం పడుతుంది అని క్యాబినెట్ మరియు ఇతర నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కేంద్రం సవరణ చేసిన మోటర్ వెహికిల్ (సవరణ) చట్టం- 2019 సెక్షన్ 67ప్రకారం ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వనున్నామని తెలిపింది. పలు రూట్లను ప్రైవేట్ పరం చేయనున్నామని తెలిపింది. నష్టాలలో ఉన్న రూట్లను ప్రైవేటు వాళ్ళకి లీజుకు ఇస్తామని లాభాలు వచ్చే రూట్ల లో మాత్రమే ఆర్టీసీ నడుపుతామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

నష్టాలు వచ్చే రూట్ల లో ప్రైవేటు వాళ్ళు ఎందుకు బస్సు తిప్పుతారు.?

ప్రభుత్వాలు రాయితీ ఇస్తే తప్ప వాళ్ళు అలా చేయరు. అదేదో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమకే ఇవ్వచ్చు కదా అని కార్మికులు అడుగుతున్నారు.

అసలు లెక్క ప్రకారం సమ్మె జరిగినప్పుడు సంబంధిత రవాణా శాఖ మంత్రి కలుగజేసుకొని చర్చలు జరిపి అప్పటికీ పరిష్కారం కాకపోతే అప్పుడు ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లి సమస్యను చక్కదిద్దవలసి ఉంది.

తెలంగాణలో ఆర్టీసీకి ఇప్పటివరకు దాదాపు మూడేళ్లుగా పూర్తిస్థాయి మేనేజింగ్ డైరెక్టర్ పదవి నియామకం జరగలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రభుత్వం తరపు నుంచి ఆర్టీసీ జరుగుతున్న చెల్లింపులు గురించే మాట్లాడుతున్నారు తప్ప, ఆర్టీసీ ప్రత్యక్షంగా పరోక్షంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టే  పన్నుల గురించి ప్రస్తావించకపోవడం బాధాకరం.

ఇక సీఎం కేసీఆర్ ఆర్టీసీకి 1200 కోట్ల రూపాయల నష్టాలను ఉందని ప్రకటించారు కానీ ఆర్టీసీ యాజమాన్యం సంబంధిత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి సమర్పించిన రిపోర్టులో ఉన్న మొత్తం 928 కోట్లు అంటే 25 శాతం ఎక్కువ చేసి కేసీఆర్ ఎందుకు చెప్తున్నారు.?

ఆర్టీసీ కిలోమీటర్ కు దాదాపు 13 రూపాయల నష్టం వస్తుందని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు.  కానీ 2018  – 2019  ఆర్టీసీ అధికారిక లెక్కల ప్రకారం ఆర్టీసీ కిలోమీటర్కి ఏడు రూపాయల నష్టం వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.ఇందులో కూడా ఇంత వ్యత్యాసం ఎందుకు.?

ఆర్టీసీకి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను 4580 కోట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు.  కానీ ఇందులో గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే రియంబర్స్మెంట్ కింద ఆర్టీసీకి దాదాపు ప్రభుత్వమే 2800 కోట్లు చెల్లించాలి.

ఇక అద్దె బస్సులు లాభం తెచ్చిపెడతాయి అన్న ప్రశ్నకి సమాధానం… అద్దె బస్సుల కు సంబంధించిన ఇన్సూరెన్స్, డ్రైవర్లకు ఇచ్చే పిఎఫ్,  ఆ బస్సులకు కట్టే పన్నులు అన్ని ఆర్టీసీ భరిస్తుంది.

నష్టాలు వచ్చినా లాభాలు వచ్చిన సంస్థ పరంగా బస్సుల సంఖ్య పెంచుకుంటూ మన ఆర్టీసీ ప్రతిపాదనను గవర్నమెంట్  పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా నష్టాలు వచ్చే  రూట్లలో అయినా పనులు రద్దు చేయండి అన్న ఆర్టీసీ ప్రతిపాదనను పరిశీలిస్తే బాగుంటుంది.

ఇంకా ఆర్టీసీ టైర్ల మీద రోడ్డు టాక్స్ రూపంలోనూ మరియు ముడి భాగాల పైన పైన మొత్తంగా సంపాదించే ప్రతి రూపాయిలో 21 పైసలు టాక్సులు కడుతుంది. మొత్తానికి ఆర్టీసీ విషయమైనా, ప్రజారవాణా  విషయమైనా  సంబంధిత యూనియన్లు అత్యాశతో,  పరిస్థితిని చక్కదిద్ది శాంతి పూర్వకమైన వాతావరణాన్ని కల్పించాల్సిన ప్రభుత్వం అహంకారం తో  వ్యవహరించడం  ఏమాత్రం మంచి పద్ధతి కాదు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All