Homeఎక్స్ క్లూసివ్మనిషి ; ప్రవక్త; దేవుడు - అసలు ఏసుక్రీస్తు ఎవరు.?

మనిషి ; ప్రవక్త; దేవుడు – అసలు ఏసుక్రీస్తు ఎవరు.?

YouTube video

చరిత్రను తనకు ముందు తన తరువాత అని రెండుగా విభజించిన యుగపురుషుడు; ప్రపంచ మానవాళికి ప్రేమ,ఆప్యాయతలను,శాంతి వంటి మంచి లక్షణాలతో పాటు శాంతి సందేశాన్ని అందించిన మహనీయుడు యేసు క్రీస్తు. పాపాల నుంచి ప్రజలను విముక్తి చేయడానికి జన్మించిన క్రీస్తు ఆ ప్రజల మంచి కోసమే ముళ్ల కిరీటాన్ని ధరించి, సిలువపై రక్తం చిందించాడు. మృతి చెందిన మూడు రోజుల అనంతరం మళ్లీ కనిపించి, పునరుత్ఖాతనం చెంది మరణాన్ని జయించి సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడు.

బైబిలు మొదటి ఐదు అధ్యాయాలను యూదులు,రోమన్స్ మిగిలిన వారందరూ ధర్మశాస్త్ర గ్రంథాలని నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని సమాజంలో ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. ఆ కాలంలో యూదులు పాప పరిహారార్ధ జంతు బలులు అర్పించేవారు, కాలక్రమేణా సమాజంలో రాజులు, మతాధికారులు, ధనవంతులు అందరూ కలిసి కావాలని తీసుకువచ్చిన అనేక ఆచారాలు వెర్రి తలలు వేశాయి. ధనిక – పేద, యజమాని – బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూడ నమ్మకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ధర్మ శాస్త్ర నియామాలు కాలానికి అనుగుణంగా సులభతరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

మేరి, జోసెఫ్‌ల కుమారుడు ఏసుక్రీస్తు. అయితే మేరి నిశ్చితార్థం అనంతరం ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని జోసెఫ్‌కు కలలో దేవ దూత కనిపించి, మేరి గర్భం దేవ సంకల్పమని, పుట్టబోయేవాడు పాపుల రక్షకుడని, అతడికి క్రీస్తుగా నామకరణం చేయాలని, ఆమెను భార్యగా అంగీకరించాలని చెప్పి అంతర్ధానమవుతుంది. దీంతో జోసెఫ్‌ మేరిని వివాహమాడతాడు. అనంతరం దైవ దూత చెప్పినట్లుగానే జోసెఫ్‌ నడుచుకున్నాడు. బెత్లహేంలోని పశువుల పాకలో మేరి మగ శిశువుకు జన్మనివ్వగా, కలలో చెప్పినట్లుగానే ఆ దంపతులు బిడ్డకు క్రీస్తుగా నామకరణం చేశారు. సరిగ్గా యేసు జన్మించిన సమయంలో ఆకాశంలో నక్షత్రం మెరవగా, దాని ఆధారంగా ముగ్గురు జ్ఙానులు యేసును చూసేందుకు వచ్చారు. అంతేగాక యూదుల రాజు జన్మించాడని వారు స్తుతిస్తారు. విషయం తెలిసిన హేరోదు రాజుకు రాజ్యం తనకు కాకుండా పోతుందన్న భయం పెరిగిపోతుంది. దీంతో రాజ్యంలో పుట్టిన చిన్నారులను చంపేయాలని ఆదేశిస్తాడు. అదే సమయంలో మేరి, జోసెఫ్‌లు తమ బిడ్డను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు .

యేసు క్రీస్తు ఎంతో గొప్పదైన ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొని సమాజంలో అణగద్రొక్కబడినవారిని అక్కున చేరుకొన్నాడు. సంఘ సంస్కర్తగా అప్పటి సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు, రాజ్యాంగం వంటి యూదుల పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సులభతరం చేసి క్రొత్త నిబంధనగా బోధించాడు. యేసుక్రీస్తు ఆధ్యాత్మిక బోధనలకు పలు యూదులు, మరికొన్ని కులాలవారు ప్రభావితులయ్యారు. రోమా సామ్రాజ్యపు రాజులకు, యూదుల్లో మత చాందస్తులకు ఏసుక్రీస్తు బోధనలు నొప్పి కలిగించాయి. యూదుల్లో కొంతమంది మత చాందస్తులు యేసుక్రీస్తును దైవ ద్రోహిగా, దేశ ద్రోహిగా చిత్రీకరించి, చివరికి రోమా సామ్రాజ్యపు రాజులకు అప్పగించారు. జెరుసలేంలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నాడంటూ నాటి మతపెద్దలు రోమన్‌ అధికారులు ఫిర్యాదు చేస్తారు. రోమా ప్రభుత్వ గవర్నర్‌ ఫిలాతు వద్దకు తీసుకెళ్తారు. అయితే క్రీస్తు గలిలీయా దేశానికి చెందినవాడవడంతో అతడిని విచారించాల్సిందే హేరోదు రాజునే అని, అక్కడికి పంపుతాడు. అక్కడ క్రీస్తును హేరోదు రాజు అవమానించి, మళ్లీ ఫిలాతు దగ్గరకే పంపుతాడు. అయితే ఫిలాతు ఏసును విచారించి, అతడు ఏ నేరమూ చేయలేదని, శిక్షించి విడుదల చేయాలని తీర్పునిస్తాడు.

అయితే పస్కా పండుగ సందర్భంగా యూదుల ఆచారం ప్రకారం ఒక ఖైదీని వదిలేయాలి. ఆమేరకు ఉన్న ఖైదీల్లో క్రీస్తును విడుదల చేస్తానని ఫిలాతు ప్రకటిస్తాడు. కానీ ప్రజలు మాత్రం నరహంతకుడు బరబ్బాను విడుదల చేసి, క్రీస్తుకు సిలువ వేయమని కేకలు వేస్తారు. అందుకు మరణానికి క్రీస్తు తగిన నేరమేదీ చేసినట్టు కనిపించలేదని ఫిలాతు మూడు సార్లు చెప్తాడు. కాగా ప్రజలు మాత్రం క్రీస్తునే సిలువ వేయాలని పట్టుబట్టారు. దీంతో తనకుగానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని చేతులు కడిగి, ప్రజలకు క్రీస్తును అప్పగించెను. క్రీస్తును జెరుసలేం నగరంలో సిలువ వేసి, ఊరేగింపుగా తీసుకెళ్లి, శిక్ష విధిస్తారు. అక్కడే సిలువపై మృతి చెంది,. చెప్పిన ప్రకారం మూడో రోజున క్రీస్తు ప్రజలకు కనిపించి, తాను మృత్యుంజయుడని నిరూపించాడు. యూదుల కోరిక ప్రకారం రోమన్ పాలకులు ఏసు క్రీస్తుకు అత్యంత కిరాతకంగా శిలువ వేశారు. తర్వాత నిర్యాణం చెంది తిరిగి మళ్ళీ పునరుత్ఖాతనం ఏసు క్రీస్తును దైవ కుమారుడని అందరూ అంగీకరించారు. ఆనాటినుండి క్రైస్తవ్యం అనే మార్గం ప్రపంచమంతా విస్తరించసాగింది. క్రీస్తు సమాకాలిక శిష్యులు, భక్తులు క్రొత్త నిబంధనలు రచించారు.

అగస్టిన్‌ పాలనాకాలంలో ఏసుక్రీస్తు జన్మించినట్లు చరిత్ర ధారారంగా తెలుస్తున్నది. మొదట్లో అంటే 5వ శతాబ్దం వరకు జనవరి 6న ఏసుక్రీస్తు జన్మదినంగా జరుపుకుంటూ వచ్చారు. ఆ తర్వాత రోమన్‌ చక్రవర్తులు క్రీస్తు జనన కాలాన్ని తెలుసుకునేందుకు జనాభా లెక్కలను సేకరించి డిసెంబర్‌ 25నే ఖచ్చితమైన తేదీగా గుర్తించారు. దీంతో 6వ శతాబ్దం నుంచి క్రీస్తు జన్మదినాన్ని డిసెంబర్‌ 25నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. ఏసు చేసిన ప్రవచనాలతో రూపు దిద్దుకున్నదే బైబిల్‌. క్రైస్తవులు ఈ గ్రంథాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. బైబిల్‌ పాత నిబంధన (ఓల్డ్‌ టెస్టిమెంట్‌) యూదులు, కొత్త నిబంధన (న్యూ టెస్ట్‌మెంట్‌)ను క్రైస్తవులు పాటిస్తారు. రోజువారీగా క్రైస్తవుల ఇళ్లలో బైబిల్‌ పఠన చేస్తున్నప్పటికీ ఆదివారం మాత్రం తప్పనిసరిగా చర్చిలకు వెళ్లి ప్రార్థన చేసుకుంటారు. బైబిలు గ్రంథమును సుమారు 1400 సంవత్సరాల పాటూ వివిధ కాలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది ప్రవక్తలు దైవ ప్రేరేపణచే వాశారు. క్రైస్తవులు బైబిల్ లోని వాక్యాలు దేవుని మాటలుగా భావిస్తారు. బైబిలు ప్రకారం ఏసు క్రీస్తు దైవ కుమారుడు. ఏసు క్రీస్తు నీతిమంతులను సశరీరంతో స్వర్గానికి తీసుకువెళడానికి రెండవసారి వస్తాడని క్రైస్తవులు నమ్ముతారు. క్రొత్తనిబంధనలోన మానవాళి పాప పరిహార్ధ నిమిత్తం ఏసు ప్రభువు ఒక అరణ్యంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయడం జరిగింది. దానికి కృతజ్ణతగా కేథలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వంటి కొన్ని క్రైస్తవ సంఘాలు శిలువ ధ్యానాలు (Lent Days) అనే పేరుతో ప్రత్యేక ప్రార్థనలు ఆచరిస్తారు.

అయితే ఇప్పటికీ కొంతమంది నాస్తికులు, హేతువాదులు, మరియు క్రైస్తవ మతం విశ్వసించని వారు ఎన్నో సందేహాలను, ప్రశ్నలను, ఆరోపణలను బైబిల్ పైన మరియు ఏసుక్రీస్తుపైన చేస్తున్నారు, వాటిలో ప్రధానంగా
ఏసుక్రీస్తు 12 ఏళ్ళనుండి 30 ఏళ్ళ మధ్య కాలంలో ఎక్కడ ఉన్నారని, ఏం చేసారని, ఆ సమయానికి సంబంధించిన విషయాలు ఏవీ ఇన్ని రకాలైన బైబిల్స్ లో లేవనే ప్రశ్న ప్రధానంగా వినపడుతోంది.?

• ఆ సమయంలో ఏసుక్రీస్తు కొంతమంది అరబ్ వర్తకులతో కలిసి ప్రపంచం పర్యటించి వచ్చ్రని కొంతమంది చెప్తున్నారు.
• మరి కొంతమంది ఆ సమయంలో ఏసుక్రీస్తు భారతదేశానికి వచ్చి ఇక్కడ వెనుకబడిన వర్గాల వారితో కలిసి తిరిగి, ఇక్కడ సమాజపరమైన సంస్కరణలు చెయ్యబోతే, ఇక్కడి వారు ఆయన పై దాడులు చేయ్యబోగా, తిరిగి మళ్ళీ ఇశ్రాయేలు కి వెళ్లిపోయారని చెప్తున్నారు
• మరికొంతమంది ఏసుక్రీస్తు ఆ 18 ఏళ్ళు భారతదేశానికి వచ్చి, హిమాయలయాలలో మహావతార్ బాబాజీ శిష్యరికం చేసారని చెప్తున్నారు
• మరికొంతమంది ఆ 18 ఏళ్ళు ప్రపంచానికి అప్పట్లో విజ్ఞాన ఖని అయిన నలంద విశ్వవిద్యాలయంలో ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్నాడని చెప్తున్నారు

అయితే ఈ విషయాలపట్ల సరైన ఆధారాలు లేవు .

మరోవైపు ఏసుక్రీస్తు కి మగ్ధలేని మరియ అనే మహిళతో వివాహం అయ్యిందని, వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడని కొంతమంది వాదన. ప్రధానంగా ఇప్పటికీ ముస్లిం లు ఏసు క్రీస్తుని ఒక ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు. దేవుడిగా ఒప్పుకోరు. పైగా ఆయన సిలువ పై మరణించలేదని కూడా ముస్లిం లు కొన్ని ఉదాహరణలతో వివరిస్తారు. అసలు ఈ విషయం మీదే ముస్లిమ్ లకు, క్రైస్తవులకు క్రూసేడ్ లుగా పిలవబడే భారీ యుద్ధాలు జరిగాయి.

సరైన వివరణ ఇవ్వని ఆధారాలు, ఆరోపణలను పక్కన పెడితే ఏసుక్రీస్తు దేవుడని, ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రజలు అనేక దేశాలలో విశ్వసిస్తున్నారు.

Unknown Facts Of Jesus christ
Unknown Facts Of Jesus christ
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All