
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగులు బడ్జెట్ తెలంగాణ కాస్తా లోటు బడ్జెట్‌గా మారిందని విమర్శించారు. బడ్జెట్‌లో ఉన్న అనుమతిని మించి అప్పులు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ అప్పు FRBM పరిధి దాటి పోతోందని విమర్శించారు. తెలంగాణలో పుట్టబోయే పిల్లలపైనే తలకు లక్షా పాతికవేలు అప్పు ఉంటోందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు అసెంబ్లీకి కూడా తెలియనీయడం లేదని ఆమె స్పష్టం చేశారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే విమర్శిస్తున్నారు తప్ప సమాధానాల్లేవ్ అన్నారు నిర్మలా సీతారామన్.
అంతకుముందు…కామారెడి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌కు స్థానిక కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్దయెత్తున స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కేంద్ర సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు నిర్మలా సీతారామన్ సూచించారు.