
లోకనాయకుడు కమల్ హాసన్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విక్రమ్’. జూన్ 03 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ దక్కించుకుంది. ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధికి చెందిన రెడ్ జెయింట్ గత నెలలో విడుదలైన ‘రాధేశ్యామ్’ చిత్రం తమిళ రిలీజ్ హక్కులను దక్కించుకున్న విషయం తెల్సిందే. కానీ రాధే శ్యామ్ వల్ల నష్టలే మిగిలాయి. ఈ క్రమంలో ఇపుడు విక్రమ్ మూవీ రైట్స్ సొంతం చేసుకొని వార్తల్లో నిలిచారు.
ఈ మూవీ లో కమల్‌తో పాటు ఫహద్ పాజిల్, విజయ్ సేతుపతి, జయరాం వంటి బిగ్ స్టార్స్ నటించారు. అనిరుధ్ రచిచంద్రన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు.