
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీనికి తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా వెసులుబాటు కల్పించింది. ఎటువంటి లాక్ డౌన్ నిబంధనలు పెట్టలేదు. షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చింది. థియేటర్లు కూడా తెలుగు సినిమా పరిశ్రమకు ఇష్టం వచ్చినప్పుడు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది.
టాలీవుడ్ లో సినిమా షూటింగ్ ల సందడి మళ్ళీ మొదలైంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలైంది. ఇక ఈరోజు నుండి మరో ఇద్దరు యంగ్ హీరోస్ బరిలో దిగారు. నాగ శౌర్య నటిస్తోన్న వరుడు కావలెను షూటింగ్ ఈరోజు తిరిగి మొదలైంది. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. లక్ష్మి సౌజన్య ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఒక పాట షూటింగ్ తో తాజా షెడ్యూల్ మొదలైనట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.
ఇక సిద్ధూ నటిస్తోన్న నరుడి బ్రతుకు నటన షూటింగ్ కూడా ఈరోజు నుండే షురూ అయింది. నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్. విమల్ కృష్ణ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.