Homeటాప్ స్టోరీస్బాలయ్య పుట్టినరోజున భారీ హంగామా

బాలయ్య పుట్టినరోజున భారీ హంగామా

బాలయ్య పుట్టినరోజున భారీ హంగామా
బాలయ్య పుట్టినరోజున భారీ హంగామా

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వచ్చేస్తోంది. జూన్ 10న నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును జరుపుకోనున్నాడు. దీంతో బాలయ్య అభిమానుల హంగామా ఓ రేంజ్ లో ఉండనుంది. గతేడాది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ టీజర్ బిట్ వదిలారు. దానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈసారి టీజర్ ను రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ లాక్ డౌన్ కారణంగా అది సాధ్యమవ్వడం లేదు. దీంతో అఖండ నుండి ఒక పవర్ఫుల్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. అలాగే దీంతో పాటు రెండు సినిమాల అనౌన్స్మెంట్లు కూడా ఉండనున్నాయి.

- Advertisement -

క్రాక్ చిత్రంతో సూపర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని బాలయ్యతో సినిమాను సెట్ చేస్తున్నాడు. జూన్ 10న ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయనున్నారు. అలాగే అనిల్ రావిపూడి ఎప్పటినుండో బాలయ్యతో పనిచేయాలనుకుంటున్నాడు. రామారావు స్క్రిప్ట్ ను గతంలో బాలయ్య కోసం ప్రిపేర్ చేసాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ కోసం సరికొత్త కథతో వస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ ను జూన్ 10న అనౌన్స్ చేయబోతున్నట్లు తెల్సింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All