
బాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా మహమ్మారి కలవరానికి గురిచేస్తోంది. ఇటీవల బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ వార్త నుంచి తేరుకునే లోపే బోనీ ఇంట్లో మరో ఇద్దరికి కరోనా అని తేలడం, ఆ తరువాత వెంటనే మరో నిర్మాత కరీం మొరానీతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లకు పాజిటివ్ అని తేలడంతో బాలీవుడ్ వర్గాల్లో మరింత భయం మొదలైంది.
తాజాగా కరణ్‌జోహార్ ఇంట్లో పని చేస్తున్న సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలడం మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కరన్‌జోహార్ వెల్లడించడంతో బాలీవుడ్ వర్గాలు భయపడుతున్నారు. `నా ఇంట్లో పని చేస్తున్న వాళ్లల్లో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దాంతో ఆ ఇద్దరిని మా బిల్డింగ్‌లోని ఓ గదిలో క్వారెంటైన్ చేశాం. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కి తెలియజేశాం.
ఇంట్లో వుంటున్న మిగతావారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. మా కుటుంబ సభ్యులతో పాటు మిగతా స్టాఫ్ అంతా సురక్షితంగా వున్నారు. ఈ రోజు ఉదయం అంతా క్వాబ్ టెస్ట్ చేయించుకున్నాం. అందరికి నెగెటివ్ వచ్చింది. అయినా అంతా 14 రోజుల పాటు క్వారెంటైన్‌లోనే వుండాలని నిర్ణయించుకున్నాం.` అరి కరణ్‌జోహార్ ట్విట్టర్ ద్వారా ఓ లేఖని విడుదల చేశారు.