Homeటాప్ స్టోరీస్బంగార్రాజులో మరో ఇద్దరు భామలు రెడీ!

బంగార్రాజులో మరో ఇద్దరు భామలు రెడీ!

బంగార్రాజులో మరో ఇద్దరు భామలు రెడీ!
బంగార్రాజులో మరో ఇద్దరు భామలు రెడీ!

అక్కినేని నాగార్జున లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సోగ్గాడే చిన్ని నాయనకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. బంగార్రాజు షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్య కృష్ణ నటిస్తుండగా కృతి శెట్టి, నాగ చైతన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక బిగ్ బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ కూడా ఈ చిత్రంలో ఒక స్పెషల్ రోల్ చేస్తోంది. కొన్ని సన్నివేశాలతో పాటు ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం బంగార్రాజులో మరో ఇద్దరు భామలు నటిస్తున్నారని తెల్సింది. వేదిక, మీనాక్షి చౌదరిలు ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ లో నటిస్తున్నారట.

- Advertisement -

వీరిద్దరూ త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే చిత్రంపై మంచి బజ్ ఉంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. బంగార్రాజు చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే అందే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All