Homeటాప్ స్టోరీస్హరిహర వీరమల్లు ... టూ మేజర్ ఈవెంట్స్ కన్ఫర్మ్

హరిహర వీరమల్లు … టూ మేజర్ ఈవెంట్స్ కన్ఫర్మ్

హరిహర వీరమల్లు ... టూ మేజర్ ఈవెంట్స్ కన్ఫర్మ్
హరిహర వీరమల్లు … టూ మేజర్ ఈవెంట్స్ కన్ఫర్మ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ డ్రామాగా చేస్తోన్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా లాక్ డౌన్ కారణంగా పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా గజదొంగ పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేసింది.

ఇక ఈ చిత్రం నుండి త్వరలో రెండు మేజర్ అప్డేట్స్ వస్తాయని సమాచారం. ముందుగా ఆగస్ట్ 17న ఒక అప్డేట్ వస్తుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్ట్ 17 ఆమె పుట్టినరోజు. దీంతో ఆరోజు హరిహర వీర మల్లు నుండి స్పెషల్ పోస్టర్ ను రివీల్ చేస్తారు.

- Advertisement -

ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హరిహర వీర మల్లు టీజర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. షూటింగ్ కు అనుమతులు వచ్చాక ముందుగా టీజర్ కట్ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తారని వినికిడి. క్రిష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All