Homeగాసిప్స్మోక్షజ్ఞ ఎంట్రీపై ఇద్దరి దర్శకుల కన్ను?

మోక్షజ్ఞ ఎంట్రీపై ఇద్దరి దర్శకుల కన్ను?

మోక్షజ్ఞ ఎంట్రీపై ఇద్దరి దర్శకుల కన్ను?
మోక్షజ్ఞ ఎంట్రీపై ఇద్దరి దర్శకుల కన్ను?

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తోంది కానీ ఎప్పుడనేది కన్ఫర్మ్ గా తెలీట్లేదు. 2019లో కచ్చితంగా ఉంటుంది అన్నారు కానీ 2020 సగం పూర్తయినా కానీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే రీసెంట్ గా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మళ్ళీ వార్తలు రావడం మొదలయ్యాయి.

ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ కచ్చితంగా ఇస్తాడని అయితే అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమని, దేవుని ఆశీస్సులు ఎప్పుడు లభిస్తే అప్పుడు ఎంట్రీ జరుగుతుందని అన్నాడు. అంటే దీన్ని బట్టి మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడం కన్ఫర్మ్ అయింది. అది వచ్చే సంవత్సరమే ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం ఇద్దరు దర్శకులు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయడానికి అమితమైన ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరు నందమూరి బాలకృష్ణతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న బోయపాటి శ్రీను. మాస్ సినిమాలకు పెట్టింది పేరైన బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ జరిగితే నందమూరి అభిమానులకు పూనకాలే. ఇక మరోవైపు నందమూరి బాలకృష్ణతో సినిమా కోసం ప్రయత్నిస్తున్న అనిల్ రావిపూడి కూడా మోక్షజ్ఞను హీరోగా ఇంట్రడ్యూస్ చేయడంపై ఆసక్తి కనబరుస్తున్నట్లు వినికిడి.

చేసిన ఐదు సినిమాలతో ఐదు సూపర్ హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. మాస్ కామెడీ పండించడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడితో సినిమా చేస్తే మోక్షజ్ఞ కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ ఈ యువ నందమూరి వారసుడి ఎంట్రీ వీరిద్దరిలో ఒకరితో ఉంటుందా లేక మరో దర్శకుడితోనా? ఈ విషయం కోసం మరి కొన్ని నెలలు ఎదురుచూడక తప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All