Homeటాప్ స్టోరీస్పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు ఈ ఛానల్ వాళ్లు

పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు ఈ ఛానల్ వాళ్లు

పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు ఈ ఛానల్ వాళ్లు
పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు ఈ ఛానల్ వాళ్లు

బుల్లితెర ఛానల్స్ అంటే జనాలని వినోదింప చెయ్యాలి. ఒక ఛానల్ కి పోటీగా ఇంకొక ఛానల్ ఏదోకటి చేసి గంధరగోళం లాంటి వింతలు చేస్తే మాట్లాడుకోవడానికి తగిన హాస్యం లా తయారవుతాయి ఆ వింతలు. చూసుకుంటే ఆ వింతలు ఈ మధ్య చాలా తయారవుతున్నాయి. వాళ్ళు కావాలని పబ్లిసిటీ కోసం చేస్తున్నారా? ఛానల్ వాళ్లకి టి.ఆర్.పి రేటింగ్ ఎక్కువ రావాలని చేస్తున్నారా? అంటే పైనున్న భగవంతునికే ఆ వింతలు ఏంటో తెలియాలి అని నవ్వేసుకుంటున్నారు జనాలు.

బిగ్ బాస్ ఒక ఛానల్ లో వస్తుంది అందరు ఆ ఛానల్ ని మాత్రమే చూస్తారు, మరి మన ఛానల్ ని ఎవరు చూడటం లేదు అని కొత్త కొత్త ఐడియా లు వెతుక్కొని వెకిలి చేష్టలు చేస్తే ఇలా ఆ ఛానల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మొన్న ఏమో అక్కినేని నాగ చైతన్య – రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ‘అదే నువ్వు అదే నేను’ సినిమా టైటిల్ పెట్టేసి ఉపగ్రహ హక్కుల్ని మేము కోనేసాం అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చూసిన సినిమా అభిమానులు తెగ నవ్వుకుంటూ అసలు నాగ చైతన్య – రష్మిక మందన్న సినిమా ఎప్పుడు మొదలు అయ్యింది? దర్శకులు ఎవరు? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వీరికి ఎలా తెలుసు? వీరు ఎమన్నా భవిష్యత్తు చెప్పే వాళ్ళ? అని నవ్వేసుకున్నారు?

- Advertisement -

మొత్తానికి ఆ పోస్ట్ అలా అందరిని తెగ నవ్వించింది. అది కేవలం ట్విట్టర్ లో ఫ్యాన్స్ ని సంపాదించుకోవడం కోసం చేసిన వెకిలి చేష్ట అని చుసిన జనాలకి అందరికి తెలుసు. ఇప్పుడు ఏకంగా బాలకృష్ణ సినిమా మీద పోస్ట్ పెడుతూ ఆ ఛానల్ పెద్ద తప్పును చేసింది. బాలకృష్ణ – కే.ఎస్.రవికుమార్ కలయికలో రెండవ సారి రాబోతున్న సినిమాకి టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మీడియా వార్తలని అడ్డం పెట్టుకుని ‘రూలర్’ అని సినిమా టైటిల్ వాళ్ళే ఫిక్స్ అయిపోయి. పోస్టర్ లో సినిమా టైటిల్ పెట్టేసి మేము ఉపగ్రహ హక్కుల్ని కోనేసాం అని ఇంకొకసారి నవ్వుల పాలు అయ్యారు.

అసలు విషయానికి వస్తే సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. రెండు మూడు టైటిల్స్ అనుకుంటున్నారు కానీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఈ లోపు మనం చెప్పేసి ట్విట్టర్ లో జనాలని పెంచేసుకుందాం అని అనుకోని ఇలా చేశారు. మొత్తానికి కథ అడ్డం తిరిగి ఇంకొకసారి నవ్వుల పాలు అయ్యారు.

మరి మొత్తం విషయం చెప్పిన నేను…..ఆ ఛానల్ పేరు చెప్పడం లేదు అని నా మీద మండిపడుతున్నారా? అయితే కింద ఉన్న ఆ పోస్ట్స్ ని చూసుకుంటూ మీరే ఆనందించండి.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All