Homeటాప్ స్టోరీస్టివి ఆర్టిస్ట్ ది హత్యా ? ఆత్మహత్యా ?

టివి ఆర్టిస్ట్ ది హత్యా ? ఆత్మహత్యా ?

TV Artist Rahul deekshit commits suicideముంబై లో బుల్లితెర పై చిన్న చిన్న పాత్రల్లో నటించే రాహుల్ దీక్షిత్ చనిపోయాడు . తన రూంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని విగత జీవిగా మారిన రాహుల్ దీక్షిత్ మరణం పై రాహుల్ తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు . నా కొడుకుని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని , అందుకు రూపాని కాశ్యప్ అనే యువతితో రాహుల్ కున్న ప్రేమ వ్యవహారమే కారణమని ఆరోపిస్తున్నాడు .

రాహుల్ తండ్రి మహేష్ దీక్షిత్ ఆరోపణలతో పోలీసులు హత్యా ? ఆత్మహత్యా ? అన్న కోణం లో దర్యాప్తు ప్రారంభించారు . జైపూర్ కి చెందిన రాహుల్ దీక్షిత్ సినిమాలపై మక్కువతో ముంబై వచ్చాడు . అయితే సినిమా అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో సీరియల్ లలో చిన్న చిన్న పాత్రలను పోషిస్తున్నాడు .ఇండస్ట్రీ లో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇలా అర్దాంతరంగా తనువు చాలించడంతో రాహుల్ కుటుంబంలో విషాదం నెలకొంది .

- Advertisement -

English Title: TV Artist Rahul deekshit commits suicide

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All