Homeటాప్ స్టోరీస్తుపాకీ రాముడు మూవీ రివ్యూ

తుపాకీ రాముడు మూవీ రివ్యూ

తుపాకీ రాముడు మూవీ రివ్యూ
తుపాకీ రాముడు మూవీ రివ్యూ

నటీనటులు: బిత్తిరి సత్తి, ప్రియ తదితరులు
సంగీతం: టి. ప్రభాకర్
సినిమాటోగ్రఫీ: సురేందర్ రెడ్డి
నిర్మాతలు: రసమయి బాలకిషన్
దర్శకత్వం: టి. ప్రభాకర్

చేవెళ్ల రవికుమార్ అంటే ఎవరా అనుకోవచ్చు కానీ బిత్తిరి సత్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణాలో బిత్తిరి సత్తి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లూ బుల్లితెరకే పరిమితమైన బిత్తిరి సత్తి ఈ మధ్యనే సినిమాల్లోకి వస్తున్నాడు. అంతలోనే సత్తి హీరోగా సినిమా రూపొందింది. తుపాకీ రాముడు పేరుతో రూపొందిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కథ:
సాఫీగా సాగిపోతున్న తుపాకీ రాముడు (బిత్తిరి సత్తి) జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. తన రాకతో సత్తి జీవితం మొత్తం తలకిందులవుతుంది. అనుకోని కొన్ని సంఘటనల వల్ల అతని జీవితం అతలాకుతలం అవుతుంది. కొన్ని పరిస్థితులకు తుపాకీ రాముడు ఎదురు నిలవాల్సి వస్తుంది.

అసలు ఈ తుపాకీ రాముడు నేపధ్యమేంటి? తుపాకీ రాముడుగా ఎందుకు మారాడు? తన జీవితంలోకి వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? తనకెదురైన ఇబ్బందుల నుండి తుపాకీ రాముడు ఎలా బయటపడ్డాడు అన్నది మిగతా కథ.

నటీనటులు:
బిత్తిరి సత్తి బుల్లితెరపై పండించే ఎంటర్టైన్మెంట్ కు తెలంగాణాలో ప్రజలందరూ ఎప్పుడో దాసోహమన్నారు. అయితే సినిమా అన్నాక కేవలం కామెడీ చేస్తే సరిపోదు, అన్ని రకాల ఎమోషన్స్ ను పండించాల్సి ఉంటుంది. తుపాకీ రాముడు చిత్రంలో కూడా అన్ని రకాల ఎమోషన్స్ ను చూపించాలని దర్శకుడు ప్రయత్నించాడు. కామెడీ సీన్లలో రెచ్చిపోయి నటించిన బిత్తిరి సత్తి, ఎమోషనల్ సన్నివేశాలు, యాక్షన్ సీన్లలో ఇబ్బంది పడ్డాడు. హీరోగా తన కెరీర్ ను పొడిగించుకోవాలి అనుకుంటే బిత్తిరి సత్తి వాటిని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే డ్యాన్సులతో బిత్తిరి సత్తి మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా డ్యాన్సులేసాడు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రియ నటన పరంగా పర్వాలేదు. అయితే ఆమె పాత్రను ఇంకొంచెం ఎఫెక్టివ్ గా చిత్రీకరించి ఉంటే బాగుండేది. రసమయి ఈ చిత్రంలో ఒక పాత్రలో కనిపించారు. మిగిలినవారంతా తమ పరిధి మేర నటించారు.

సాంకేతిక నిపుణులు:
దర్శకుడిగా టి ప్రభాకర్ ఓ మోస్తరు పనితనాన్ని చూపించాడు. కథ పరంగా విభిన్నమైనది ఎంచుకున్నా స్క్రీన్ ప్లే విషయంలో పూర్తిగా తడబడ్డాడు. ఎంటర్టైనింగ్ గా కథను చెప్పాలనే ప్రయత్నంలో కథనాన్ని గాడి తప్పించాడు. అయితే ఈ చిత్రంలో ఎక్కువగా తెలంగాణ యాసను, ప్రాంతాల్ని, పద్యాలను వాడుకున్న తీరు ఆకట్టుకుంటుంది. టి. ప్రభాకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా అందించారు. రెండు పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్ గా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. తెలంగాణ పల్లె అందాలను చాలా బాగా చూపించారు. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి.

చివరిగా:
కమెడియన్ గా కొంచెం పేరు వచ్చిన ఎవరైనా హీరోగా ప్రయత్నిస్తున్న రోజులివి. అలాంటిది తెలంగాణాలో మాస్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న బిత్తిరి సత్తి హీరోగా ప్రయత్నించడంతో వింతేమి లేదు. అయితే నాణ్యమైన కథతో హీరోగా తన మొదటి ప్రయత్నాన్ని చేసుంటే బాగుండేది. తుపాకీ రాముడు కథ విభిన్నంగా ఉన్నా టేకింగ్ లో లోపల వల్ల ఆసక్తి రేకెత్తించదు. నిర్మాణ విలువలు కూడా సో సో గా ఉండడంతో తుపాకీ రాముడు కొంతసమయం గడిచే సరికి విసిగిస్తాడు. బిత్తిరి సత్తి మధ్యమధ్యలో తనదైన శైలిలో పండించిన హావభావాలు ప్రేక్షకులను రంజింపచేసినా ఓవరాల్ గా తుపాకీ రాముడి తూటా పేలడం కష్టమే.

తుపాకీ రాముడు – తూటా తుస్సుమంది

రేటింగ్ : 2/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All