Homeటాప్ స్టోరీస్టక్ జగదీష్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి మరి!

టక్ జగదీష్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి మరి!

టక్ జగదీష్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి మరి!
టక్ జగదీష్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి మరి!

న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతోందని వార్తలు వస్తోన్న విషయం తెల్సిందే. మొదట ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. థియేట్రికల్ రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత డిజిటల్ రిలీజ్ చేయాలని డీల్ సెట్ అయింది.

అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. థియేట్రికల్ రిలీజ్ కుదరని నేపథ్యంలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ తో డీల్ ను మరోసారి మార్చుకున్నారు. ఈసారి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం 37 కోట్ల రూపాయలకు డీల్ కుదిరింది. ఐడి కాకుండా స్టార్ మా సంస్థ సాటిలైట్ హక్కులను 7 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసింది. ఇక ఆడియో రైట్స్ కు 2 కోట్లు, హిందీ డబ్బింగ్ రైట్స్ కు 4.5 కోట్ల రూపాయలు ఇలా మొత్తం కలుపుకుని టక్ జగదీష్ 51 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

- Advertisement -

ఈ ప్యాండెమిక్ పరిస్థితిలో ఇది డీసెంట్ అమౌంట్ అనే చెప్పాలి. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All