
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం టక్ జగదీష్. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు ఓటిటి ఆఫర్లు బాగానే వచ్చినా టీమ్ మాత్రం వాటిని తిరస్కరించింది. కచ్చితంగా థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని చెప్పింది.
అయితే ఇంకా విడుదల తేదీ విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం వెయిట్ మోడ్ లోనే ఉండడం బెటర్ అని భావిస్తోంది. జులై 30 నుండి టాలీవుడ్ లో సినిమాల విడుదలలు ఉంటాయి. జులై 30న తిమ్మరుసు, ఆగస్ట్ 6న ఎస్ఆర్ కళ్యాణ మండపం చిత్రాలు విడుదలవుతున్నాయి.
ఆగస్ట్ 13 ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా టక్ జగదీష్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆగస్ట్ నెలాఖరుకు కూడా విడుదల కావొచ్చు. మరికొన్ని రోజులు ఆగితే కానీ ఈ విషయంపై క్లారిటీ రాదు. శివ నిర్వాణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.