
తెలంగాణ సర్కార్ చిత్రసీమ పట్ల ఎప్పుడు చల్లని చూపే చూస్తుంటుంది. పెద్ద సినిమాల రిలీజ్ టైంలోనే అదనపు షోస్ కు , బెనిఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వడం అలాగే వారం రోజుల పాటు టికెట్స్ ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వడం వంటివి చేస్తూ నిర్మాతలకు , డిస్ట్రబ్యూటర్స్ కు లాభాలు తెప్పిస్తుంటుంది. ఇప్పటివరకు చాల సినిమాలకు ఇలా చేసింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో తెరకెక్కిన ఆచార్య చిత్రానికి కూడా ఇలాంటి సదుపాయాలే ఇచ్చింది.
చిరంజీవి, ఆయన కుమారుడు రాంచరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఐదో ఆటకు అనుమతి మంజూరు చేస్తూ తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏడు రోజుల పాటు రోజుకు 5 ఆటల చొప్పున ప్రదర్శనకు అవకాశం ఇచ్చింది. సినిమా హాళ్లలో ఆయా కేటగిరీలను బట్టి టికెట్ రేట్లను కూడా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీ కేటగిరీలో మాత్రమే ఈ పెంపును ప్రభుత్వం అనుమతించింది. ఈ ధరలను రూ.30 నుంచి రూ.50కి పెంచుకేనేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ల పెంపును కూడా ఏడు రోజుల వరకు మాత్రమే అనుమతించింది. ఈ ప్రకటన తో చిత్ర యూనిట్ తో పాటు మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.