Homeటాప్ స్టోరీస్జగనన్న కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కవిత

జగనన్న కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన కవిత

TRS MP Kavitha tweets on jaganవై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత . తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత జగన్ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమయ్యాడు . అయితే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకి పట్టం కట్టారు ప్రజలు దాంతో అధికారం కోసం పాదయాత్ర చేసున్నాడు జగన్ . శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నది రాజకీయ సిద్ధాంతం అందుకే టీఆర్ఎస్ కు ఆగర్భ శత్రువైన చంద్రబాబు కి పక్కలో బల్లెం అయిన జగన్ ని మిత్రుడిగా భావిస్తున్నారు కేసీఆర్ అండ్ కో .

అందుకే జగన్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది కవిత . గత ఎన్నికల్లోనే అక్కడ జగన్ ఇక్కడ మేము అంటూ ప్రకటించారు కేసీఆర్ కానీ ఆ అంచనా తల్లకిందులయ్యింది . ఇక్కడ అప్పుడే కాదు ఇప్పుడు కూడా కేసీఆర్ భారీ మెజారిటీ తో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు . అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 2019 ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరుగనున్నాయి దాంతో అక్కడ చంద్రబాబు అధికారం కోల్పోవడం ఖాయమని జగన్ సీఎం కావడం ఖాయమని భావిస్తున్నారు కవిత . అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు కేసీఆర్ అండ్ కో .

- Advertisement -

English Title: TRS MP Kavitha tweets on jagan

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All