Homeగాసిప్స్ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ ఇదేనా?

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ ఇదేనా?

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ ఇదేనా?
ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ ఇదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం న‌టిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ  షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహమ్మారి క‌రోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ ఆలస్యం అవుతూ వ‌చ్చింది. దీంతో త్రివిక్రమ్‌తో కలిసి చేయాల్సిన మూవీ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది.

`ఆర్ఆర్ఆర్` పూర్త‌యిన వెంట‌నే త్రివిక్ర‌మ్ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ – ఎన్టీఆర్‌ల క‌ల‌యిక‌లో రానున్న రెండవ సినిమా ఇది. రాజకీయ నేప‌థ్యంలో ఫ్యామిలీ అంశాల మేళ‌వింపుగా ఈ మూవీని తెర‌పైకి తీసుకురానున్నారు. ఈ చిత్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు `అయిన‌ను పోయి రావ‌లే హ‌స్థిన‌కు` అనే పేరుతో పాటు ప‌లు పేర్లు వినిపించాయి. తాజాగా `రాజా వ‌చ్చినాడు` అనే పేరుని ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్ట్ ని పూర్తి చేసి రెగ్యుల‌ర్ షూట్ కోసం నటులను కూడా ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఎన్టీఆర్ ఎప్పుడు `ఆర్ఆర్ఆర్` నుంచి బ‌య‌టికి వ‌చ్చేస్తే అప్పుడు ప్రారంభించాల‌ని ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All