Saturday, August 13, 2022
Homeగాసిప్స్సెంటిమెంట్ కే ఓటేస్తున్న గురూజీ

సెంటిమెంట్ కే ఓటేస్తున్న గురూజీ

సెంటిమెంట్ కే ఓటేస్తున్న గురూజీ
సెంటిమెంట్ కే ఓటేస్తున్న గురూజీ

త్రివిక్రమ్ శ్రీనివాస్ సెంటిమెంట్ లను బాగా ఫాలో అవుతాడు. టైటిల్ మొదలు ‘అ’ ఉండాలనేది ఒక సెంటిమెంట్. ఈ మధ్య కాలంలో టైటిల్స్ అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో.. నెక్స్ట్ తీయబోయే అయినను పోయి రావలె హస్తినకు అన్నీ అ సెంటిమెంట్ ను ఫాలో అయ్యేవే. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మరో సెంటిమెంట్ ఉంది. తన సినిమాల్లో హీరోయిన్లను ఎక్కువగా రిపీట్ చేయడం త్రివిక్రమ్ కు అలవాటు. కెరీర్ మధ్యలో ఇలియానాను అలాగే రిపీట్ చేసాడు. తర్వాత సమంత వరసగా త్రివిక్రమ్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు పూజ హెగ్డే వంతు వచ్చింది.

- Advertisement -

అజ్ఞాతవాసి లాంటి సినిమా త్రివిక్రమ్ స్థాయి దర్శకుడి నుండి అసలు ఊహించలేం. అలాంటి సినిమాతో తన స్టామినా మీదే డౌట్లు వచ్చేలా చేసుకున్న త్రివిక్రమ్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన స్థితిలో చేసిన సినిమా అరవింద సమేత. ఇందులో పూజ హెగ్డే కథానాయిక. సినిమా రిజల్ట్ సూపర్ హిట్. అయినా కానీ ఇది త్రివిక్రమ్ స్టైల్ లో సాగే సినిమా కాదు. అందుకే అల వైకుంఠపురములో విషయంలో కూడా విడుదలకు ముందు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ అల వైకుంఠపురములో సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసేసాడు త్రివిక్రమ్. అలాంటి ఇలాంటి హిట్ కూడా కాదు. బాహుబలి 2 కాకుండా మిగిలిన అన్ని సినిమాల కంటే అత్యధిక కలెక్షన్స్ ను సాధించింది ఈ చిత్రం. ఇందులో కూడా పూజ హెగ్డే కథానాయికగా నటించింది.

సో త్రివిక్రమ్ ఏమైనా సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడేమో మరేంటో తెలీదు కానీ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు కూడా పూజ హెగ్డేనే కథానాయికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ముందు ఈ సినిమాకు రష్మికను అనుకున్నా సెంటిమెంట్ ప్రకారం పూజకే త్రివిక్రమ్ ఓటు వేసాడట. పాలిటిక్స్ టచ్ ఉన్న ఈ సినిమాను మే లో మొదలుపెట్టి వచ్చే ఏప్రిల్ కు విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి పూజ ఈ సినిమాలో నటిస్తోందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts