
టాలీవుడ్‌లో వున్న టాప్ డైరెక్టర్‌లలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ప్రత్యేక గుర్తింపు వున్న విషయం తెలిసిందే. ఆయనకు మాటల మాంత్రికుడు అనే ప్రత్యేక పేరుంది. తనదైన శైలి మాటలతో ఎంటర్‌టైన్ చేయడం ఆయన స్టైల్. దీంతో ఆయన చిత్రాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవల బన్నీతో చేసిన `అల వైకుంఠపురములో` ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో ఆయనంటే మరింత డిమాండ్ ఏర్పడింది.
ఎంతలా అంటే కేవలం డైలాగ్‌లకు, స్క్రిప్ట్ సూపర్ విజన్ కు ఏకంగా 10 కోట్లు ఇస్తున్నారట. వివరాల్లోకి వెళితే.. ఫృథ్వీరాజ్ సుకుమారన్, బీజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`. ఈ చిత్రాన్ని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రీమేక్ చేయబోతోంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరపైకి రానున్న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు.
ఇందులో పవన్ తో కలిసి ఎవరు నటస్తారన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ స్క్రిప్ట్‌ని తెలుగు నేటివిటీకి అనుగునంగా సాగర్ చంద్ర మార్చేశారు. ఈ మూవీకి త్రివిక్రమ్ మాటలు రాస్తున్నారట. ఇందు కోసం ఆయనకు 10 కోట్లు ఇస్తున్నారని తెలుస్తోంది.