Homeటాప్ స్టోరీస్స్టార్ డైరెక్టర్ తో మెగాస్టార్ మెగా ఇంటర్వ్యూ

స్టార్ డైరెక్టర్ తో మెగాస్టార్ మెగా ఇంటర్వ్యూ

Trivikram Srinivas to interview Chiranjeevi
Trivikram Srinivas to interview Chiranjeevi

సైరా నరసింహారెడ్డి మంచి టాక్ తో నడుస్తోంది. మొదటి షో నుండే ఈ చిత్రానికి మంచి రేటింగ్స్ రాగా మొదటి రోజు కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. చాలా చోట్ల బాహుబలి రికార్డులను కూడా అధిగమించింది సైరా. రెండో రోజు కొంచెం డ్రాప్ కనిపించినా ముందున్నవి దసరా సెలవులు కావడంతో సైరా కచ్చితంగా పుంజుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు ట్రేడ్ పండితులు.

సైరా సక్సెస్ తో హ్యాపీగా ఉన్న మెగా ఫ్యామిలీ ప్రమోషన్స్ ను మరింత దూకుడుగా చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవిని స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇంటర్వ్యూ చేయించాలని డిసైడ్ అయ్యారు. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ షూట్ చేస్తారని సమాచారం.

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. తన కెరీర్ లో అత్యధికం మెగా హీరోలైన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవితో కూడా త్వరలోనే సినిమా చేయాలనే కమిట్మెంట్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలో బోలెడన్ని విశేషాలు తెలిసే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All