
అల వైకుంఠపురములో వంటి భారీ బ్లాక్ బస్టర్ కొట్టినా కానీ ఏడాదిన్నర కాలం నుండి త్రివిక్రమ్ ఖాళీగానే ఉన్నాడు. ముందుగా ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నా అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాను ప్రకటించాడు కానీ అది పట్టాలెక్కడానికి ఇంకా సమయం పడుతుంది.
ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జులై నుండి మొదలవుతుంది. అది పూర్తయితే కానీ త్రివిక్రమ్ సినిమా ముందుకు కదలదు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈలోగా పవన్ కళ్యాణ్ చిత్రంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి అయ్యప్పనుమ్ కోశియుము చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నాడు. జులై రెండో వారం నుండి మొదలయ్యే ఈ చిత్ర షూటింగ్ కు త్రివిక్రమ్ కూడా హాజరుకానున్నాడట. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.