Tuesday, September 27, 2022
Homeగాసిప్స్త్రివిక్రమ్ ఈసారి కూడా భారీగానే ప్లాన్ చేసాడుగా

త్రివిక్రమ్ ఈసారి కూడా భారీగానే ప్లాన్ చేసాడుగా

త్రివిక్రమ్ ఈసారి కూడా భారీగానే ప్లాన్ చేసాడుగా
త్రివిక్రమ్ ఈసారి కూడా భారీగానే ప్లాన్ చేసాడుగా

సాధారణంగా ఏదైనా సినిమాలో మీ సినిమాలో ప్రధాన తారాగణం ఎవరు అంటే హీరో, హీరోయిన్ కాకుండా మరో ఇద్దరు, ముగ్గురు పేర్లు చెప్పి ఊరుకుంటారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు తీసుకుంటే ఆ సపోర్టింగ్ కాస్ట్ లిస్ట్ అంతకంతకూ పెరిగిపోతూ ఉంది. సినిమా, సినిమాకూ త్రివిక్రమ్ తన సపోర్టింగ్ కాస్ట్ ను పెంచుతుండడం హైలైట్ అవుతోంది. సన్నాఫ్ సత్యమూర్తి నుండి అనుకుంటా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పంథా ఫాలో అవుతున్నాడు. తెరనిండా నటులను తనివితీరా నింపుతున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి చిన్న రోల్ అయినా కూడా నిత్యా మీనన్ ను తీసుకున్నాడు. కాసేపే కనిపించే పాత్రే అయినా కూడా ప్రకాష్ రాజ్ కావాలన్నాడు. ఉపేంద్రను ముఖ్య పాత్ర కోసం తీసుకొచ్చాడు. ఆయన భార్యగా ఏ నటి ఉన్నా పనైపోయేది. అంతగా ప్రాధాన్యత లేని పాత్రకు స్నేహను దించాడు. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో కూడా సీన్లు ఎక్కువగా ఉంటాయి.

- Advertisement -

అదే అజ్ఞాతవాసికి కూడా కంటిన్యూ చేసాడు. ఇందులో ఖుష్బూను ముఖ్య పాత్రకు తీసుకున్నాడు. కొద్ది సేపే కనిపించే పాత్ర అయినా బోమన్ ఇరానీని ఎంచుకున్నాడు. మురళీ శర్మ, రావు రమేష్, తనికెళ్ళ భరణి.. ఇలా సపోర్టింగ్ కాస్ట్ చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్ట్ అవుతుంది. ఎందుకో త్రివిక్రమ్ ఈ ఫార్ములాకే ఫిక్స్ అవుతున్నాడు. తెరనిండా నటులు, ఆ పాత్రలకు పేరున్న వాళ్ళు. దీని వల్ల ప్రొడక్షన్ కాస్ట్, సినిమా బడ్జెట్, మూవీ మేకింగ్ టైమ్ ఇలా మూడూ అధికమవుతున్నాయి. అందుకే త్రివిక్రమ్ సినిమాలకు బడ్జెట్ పరిమితి మించి పెరుగుతుంది అన్న పేరుంది. అరవింద సమేతలో ఇదే ఫాలో అయ్యాడు. ఈ సినిమాలో కూడా తెర నిండా పేరున్న నటులే కనిపిస్తారు.

ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న అల వైకుంఠపురములో విషయంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఫార్ములాను వదల్లేదు. ఇంకా అధికమైంది కూడా. ఈ సినిమా సపోర్టింగ్ కాస్ట్ లిస్ట్ వేసుకుంటే ఒక పది పేర్లు దాకా వస్తాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్, పూజ హెగ్డే హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెల్సిందే. వీళ్ళు కాకుండా సుశాంత్, నివేద పేతురాజ్ నటించారు. వీళ్ళతో పాటు టబు, మలయాళ నటుడు జయరాం, బాలీవుడ్ నటుడు సచిన్ కెడ్కర్, మురళీ శర్మ, టబు, రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ళ భరణి, సునీల్, నవదీప్ ఇలా చెప్పుకుంటూ లిస్ట్ భారీగానే ఉంది. మరి అందరికీ ఇందులో సమ పాత్రలు దొరుకుతాయా అంటే డౌటే. మరి చిన్న పాత్రలకు కూడా పేరున్న వాళ్లనే తీసుకోవాలనే కోరిక ఎందుకో అర్ధం కాదు.

ఏదేమైనా ఈ సినిమపై బజ్ భారీగా ఉంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. డిసెంబర్ మొదటి వారానికి షూటింగ్ ను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం బ్రహ్మాండంగా విడుదల కానుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts