Homeగాసిప్స్ఎన్టీఆర్ కు కావాల్సింది ఈసారి కూడా త్రివిక్రమ్ ఇవ్వట్లేదా?

ఎన్టీఆర్ కు కావాల్సింది ఈసారి కూడా త్రివిక్రమ్ ఇవ్వట్లేదా?

ఎన్టీఆర్ కు కావాల్సింది ఈసారి కూడా త్రివిక్రమ్ ఇవ్వట్లేదా?
ఎన్టీఆర్ కు కావాల్సింది ఈసారి కూడా త్రివిక్రమ్ ఇవ్వట్లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎప్పటినుండో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని కోరిక. మాస్ అంశాలు లేకుండా క్లాసీగా ఉండే సినిమా చేయాలని కోరుకుంటున్నాడు. అయితే ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా అందరూ అటువంటి కథలే తీసుకోస్తున్నారు. అవి హిట్ అవుతున్నాయి కానీ ఎన్టీఆర్ కోరిక మాత్రం తీరట్లేదు. అందుకని ఏరికోరి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలనుకున్నాడు. అయితే అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ అవ్వడంతో త్రివిక్రమ్ తన స్టైల్ మార్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఫలితంగా ఫ్యాక్షన్ నేపథ్యంలో అరవింద సమేత చిత్రాన్ని చేసాడు. ఆ సినిమా కూడా హిట్టైంది కానీ ఎన్టీఆర్ కోరిక మాత్రం అలానే ఉండిపోయింది.

ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇందులో కొమరం భీమ్ రోల్ పోషిస్తున్నాడు. ఇది కూడా యాక్షన్ ప్రధానంగా సాగబోయే సినిమానే. ఆర్ ఆర్ ఆర్ వంటి హెవీ ఫిల్మ్ చేసినప్పుడు తన తర్వాతి సినిమా లైటర్ వైన్ లో వెళ్లాలని ఎవరైనా అనుకోవడం సహజం. అందుకే త్రివిక్రమ్ స్టైల్లో ఒక క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఎన్టీఆర్ మరోసారి మాటల మాంత్రికుడితో జట్టుకడుతున్నాడు.

- Advertisement -

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఒక క్లాస్ ఎంటర్టైనర్ చేసాడు. అల వైకుంఠపురములో త్రివిక్రమ్ స్టైల్లో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది కూడా. కాకపోతే క్లాస్ ఎంటర్టైనెర్స్ చేస్తున్న ప్రతిసారి త్రివిక్రమ్ తన పాత సినిమాలను గుర్తుకుతెస్తున్నాడు. అల వైకుంఠపురములో చూసిన తర్వాత కూడా అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు చాలా చోట్ల గుర్తుకొస్తాయి. ఈ సినిమా అయితే ఆడింది కానీ మరోసారి క్లాస్ ఎంటర్టైనర్ అటెంప్ట్ చేసి అందులోనూ ఈ ఛాయలే ఉంటే సినిమా ఫలితం కచ్చితంగా తేడా కొడుతుంది. ఈ విషయం త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా తెలుసు. అందుకనే తన నెక్స్ట్ సినిమాకు స్టైల్ మొత్తం మార్చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీ స్టోరీ అని కోరుతున్నా త్రివిక్రమ్ వేరే కథ సిద్ధం చేస్తున్నట్లు భోగట్టా. మరి చూడాలి చివరికి ఎలాంటి కథ సెట్ అవుతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All